జగన్‌పార్టీలోకి వనమా? కృష్ణ హెచ్చరిక, సూసైడ్‌యత్నం

Vanama seeing at TRS
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత వనమా వెంకటేశ్వర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని వీడి జగన్ వైపు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారట. ఈ విషయంలో జగన్‌తో వనమా చర్చలు జరుపుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే వనమా వెంకటేశ్వర రావు రాకను యడవల్లి కృష్ణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేకిస్తుండటంతో వనమా, యడవల్లితో జగన్ సమావేశం కానున్నారని సమాచారం. వనమా వస్తే తాను పార్టీని వీడుతానని యడవల్లి స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పార్టీలో వనమా రాకను వ్యతిరేకిస్తూ జిల్లాలో ఇద్దరు మహిళలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

కాగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ధూళిపాళ్లకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+