వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వెంకయ్యకు సిగ్గుంటే రిజైన్ చేయాలి': ఏపీకి అదనపు ప్యాకేజీ ఇదే!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు పైన సిపిఐ నేత రామకృష్ణ మంగళవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక సాయం పేరుతో సీఎం చంద్రబాబు, వెంకయ్యలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

వెంకయ్యకు ఏమాత్రం సిగ్గున్నా త‌న కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్యాల‌ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వెంక‌య్య పోరాడాలన్నారు. తాము ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక‌ హోదాపై పోరాడుతోంటే బీజేపీ నేత‌లు ఎదురుదాడికి దిగ‌డం స‌రికాద‌న్నారు.

కేంద్రం ఏపీకీ కూడా బుందేల్ ఖండ్ తరహా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీది కార్పోరేట్ ప్రభుత్వంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

Venkaiah Naidu

వెంకయ్య సమీక్ష.. ప్యాకేజీ ఇవే!

ఏపీ ప్రాజెక్టులపై సహచర మంత్రులతో వెంకయ్య మంగళవారం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, పీయూష్ గోయల్‌లతో చర్చించారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.64,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు, అలాగే వేగంగా పనులు చేస్తున్నామని ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు.

ఏపీలో ఐదు రక్షణ ప్రాజెక్టులు పెట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ తెలిపారు. బొబ్బిలిలో నావల్ స్టేషన్, నాగాయలంకలో డీఆర్డీవో మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ, కర్నూలులో నేషనల్ ఎపెన్ ఎయిర్ రేంజ్, కొక్కిరాలకొండలో ట్రూప్స్ ట్రైనింగ్ సెంటర్, నిమ్మకూరులో నైట్ విజన్ పరికరాల తయారీ సంస్థ డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని వెంకయ్యకు పారికర్ వివరించారు.

విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు అయినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. దీనిని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఏపీకి నిరంతర విద్యుత్ అందిస్తున్నందుకు గోయల్‌కు వెంకయ్య అభినందనలు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు కృషి చేసిన అమిత్ షాపై వెంకయ్య ప్రశంసలు కురిపించారు.

English summary
Union Minister, BJP leader Venkaiah naidu should resing, says Ramakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X