రోజా ఎవరో తెలియదు: నంద్యాలలో వేణుమాధవ్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎవరో తనకు తెలియదని హస్య నటుడు వేణుమాధవ్ చెప్పారు.డిగ్రీ పూర్తైన తర్వాత తనకు టిడిపితో, ఎన్‌టిఆర్‌తో సంబంధాలు ఏర్పడ్డాయన్నారు.భూమా బ్రహ్మనందరెడ్డి విజయం తథ్యమన్నారు వేణు మాధవ్.
నంద్యాల: ప్రముఖ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై హస్యనటుడు వేణుమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా ఆమె ఎవరో నాకు తెలియదు..సారీ.. అంటూ దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు.
నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి తరపున హస్యనటుడు వేణుమాధవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు వేణుమాధవ్ నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. 'రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్నిటీడీపీ అధిష్ఠానంరంగంలో దింపాదనే కామెంట్స్ వస్తున్నాయి?' అని ప్రశ్నించగా..'ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ' అని వేణుమాధవ్ సమాధానమిచ్చాడు.

తాను డిగ్రీ పూర్తైన తర్వాత ఎన్టీ రామారావు దగ్గర కొంతకాలం పనిచేసినట్టు చెప్పారు.అక్కడి నుండి టిడిపి కార్యాలయంలో కూడ పనిచేశానని ఆయన గుర్తుచేసుకొన్నారు.ఈ కారణంగానే తనకు టీడీపీతో, నందమూరి కుటుంబంతో అనుబంధం ఉందన్నారు.
భూమా నాగిరెడ్డి కుటుంబంతో తనకు కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. ఆ అనుబంధం కారణంగానే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు వేణుమాధవ్ చెప్పారు.
'సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి..భూమా బ్రహ్మానందరెడ్డికే ఓటెయ్యండి' అని చెప్పను. ఎందుకంటే, అందరి గుండెల్లో సైకిల్ గుర్తు ఉందని చెప్పారు వేణుమాధవ్.
అందరి హృదయాల్లో భూమా నాగిరెడ్డి గారు, శోభానాగిరెడ్డి గారు ఉన్నారు.
ప్రజలందరూ కూడా భూమా కుటుంబం వైపే ఉన్నారు. హండ్రెట పర్సెంట్ టీడీపీ విజయం సాధిస్తుంది. అందులో, ఎలాంటి అనుమానం లేదు. మేము ఆలోచించేదల్లా.. ఎంత మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుస్తాడనే విషయమే.. మిగతా విషయాలను పట్టించుకోవట్లేదని' చెప్పారు వేణుమాధవ్












Click it and Unblock the Notifications