వివేకాను హత్య చేసిన వాళ్లు ఇలాంటివీ చేయగలరు: చంద్రబాబు అనుమానం

Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

Vijayawada floods 2024 Chandrababu raised doubts as conspiracy

ప్రకాశం బ్యారేజీకి వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించింది. రాత్రికి దీని తీవ్రత 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లుగా విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

వర్షాలు, వరద తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంటోంది. అధికార యంత్రాంగం మొత్తాన్నీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపజేసింది. పార్టీ క్యాడర్ సహాయ, సహకారాలనూ తీసుకుంటోంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ మంత్రి నారా లోకేశ్‌ ఇప్పటికే కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

వరద ప్రవాహం ధాటికి భారీ ఫిషింగ్ బోట్లు కొట్టుకుని వచ్చి బ్యారేజీ గేట్లను బలంగా ఢీ కొట్టిన ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దీని వెనుక కుట్రకోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉండొచ్చని పరోక్షంగా విమర్శించారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కొందరు క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని, వాళ్ల వల్ల ప్రతిరోజూ ప్రజలకు, తనకూ ఎన్నో అనుమానాలు వస్తూనే ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టాయని, దానివల్ల కొంత డ్యామేజీ జరిగిందని, వాటిని ఎలా సరిచేయాలనేది చర్చిస్తామని అన్నారు.

ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసి, దాన్ని గుండెపోటుగా ప్రచారం చేసిన వాళ్లు ఇలాంటివి కూడా చెయ్యొచ్చేమో.. అని వ్యాఖ్యానించారు. ఆనకట్టలు, బండ్‌లను నేరస్తులు ధ్వంసం చేసే అవకాశం ఉందనే కారణంతో అక్కడ పెట్రోలింగ్ పెట్టాలంటూ రాష్ట్ర డీజీపీనీ ఆదేశించానని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొందరు క్రిమినల్స్ ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్దేశపూరకంగా గేట్లను ధ్వంసం చేయాలనే కారణంతో ప్రకాశం బ్యారేజీలోకి బోట్లను వదిలి ఉండొచ్చనే అనుమానాలను కొట్టిపారేయడానికి వీలు లేదని చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+