కెసిఆర్‌కు 'ముఖ్య' బాధ్యతలు ఇస్తే విలీనం: కెటిఆర్ నో

న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు 'ముఖ్య' బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెసు పార్టీలో తమ పార్టీని విలీనం చేయడానికి అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత వినోద్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పినట్లు సోమవారం ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై వినోద్ స్పందించారు.

కఠినమైన దారిలో నడిచి తెలంగాణ సాధించిన కెసిఆర్‌కు తెలంగాణలో పూర్తిస్థాయి, ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తే విలీనానికి తమకు అభ్యంతరం లేదన్నారు. పదమూడేళ్ల పోరాటంలో కెసిఆర్ ప్రతి అంశం మీద అవగాహన సంపాదించారన్నారు. అలాంటి నాయకుడి వల్లే తెలంగాణ నిర్మాణం సాధ్యమన్నారు. ఉద్యమం ద్వారా అనేక సమస్యలను ఆయన ఆకళింపు చేసుకున్నారని చెప్పారు.

కాగా, ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని, కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికైనా, పొత్తుకైనా తాము సిద్ధమని, ఒకవేళ విలీనమే కావాలని మీరంటే ఆ తర్వాత తెలంగాణ

Vinod responds on Digvijay merger statement
పునర్నిర్మాణంలో, పార్టీలో తన పాత్ర ఏమిటో స్పష్టత ఇవ్వాలని కెసిఆర్ కాంగ్రెస్ పెద్దలకు సూటిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య ఒక అవగాహన కూడా కుదిరిందని తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో కెసిఆర్ కీలక పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పార్టీకి ఆయనే విజయ సారథ్యం వహిస్తారని అంటున్నాయి.

కెసిఆర్‌కు అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రచారంలోనూ కీలక బాధ్యతలు అప్పజెప్పాలని తెరాస డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ తర్వాతే విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. విలీనంపై ఢిల్లీలోనే ప్రకటించడమా, లేక రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడమా అన్నది కూడా ఒకటి రెండురోజుల్లో తేలనుంది.

పొత్తుపైనే మొగ్గు: కేటీఆర్

కాంగ్రెస్‌లో విలీనానికి తమ పార్టీలో అత్యధికులు విముఖత చూపుతున్నారని, పొత్తుపైనే మొగ్గు చూపుతున్నారని కెటిఆర్ చెబుతున్నారు. తెరాస బలమైన శక్తిగా కొనసాగడం తెలంగాణ ప్రయోజనాలకు అవసరమన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందుగానే (మార్చి మొదటివారం) కాంగ్రెస్‌తో పొత్తా, విలీనమా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవచ్చునని కెటిఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+