హింసతో సమస్యకు పరిష్కారం లభించదు: కావేరీ వివాదంపై వెంకయ్య
అమరావతి: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన కావేరీ జలాల పంపిణీపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక మధ్య తరచూ కావేరీ జలాల పంపిణీ వివాదం ఇబ్బందిగా ఉందని అన్నారు.

ఆందోళనల పేరిట ఆస్తును ధ్వంసం చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. ఆందోళన కారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సరికాదని ఆయన చెప్పారు. ఆందోళలతో సమస్యలకు పరిష్కారం కాదని, సామరస్య పూర్వక చర్చల ద్వారానే అధి సాధ్యమవుతుందని అన్నారు.
Mandya (Karnataka): #CauveryProtests in many parts of Karnataka, security forces on high alert. pic.twitter.com/D84mK7XWrF
— ANI (@ANI_news) September 13, 2016
కావేరీ వివాదంపై రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రాంతాలు పేరిట విధ్వంసాలకు దిగడం సరికాదని మనమంతా భారతీయులమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. భద్రతా దళాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
సమస్యల పరిష్కారానికి స్వచ్చంధంగా ముందుకు రావాలని, అలా లేని పక్షంలో న్యాయవ్వవస్థ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ముఖ్యమంత్రులు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆందోళనలు హింసాత్మకంగా మారకూడదని ఆయన తెలిపారు.
#CauveryProtests : Public are requested to use Karnataka Police Help Line 18004250100 or 155365 for any emergency/assistance/help @CPBlr
— BengaluruCityPolice (@BlrCityPolice) September 13, 2016
కాగా కావేరీ జలాల పంపిణీ వివాదం సోమవారం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక రాజధాని బెంగుళూరుతో పాటు మండ్య లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది.

బెంగుళూరు నగరంలోని యగ్గనహళ్లి ప్రాంతంలో హింస పేట్రగడంతో ఒక యువకుడు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు కూడా కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడానికి కారణమని తెలియడంతో వాటిల్లో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మవద్దని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు.
#CauveryProtests : Karnataka State Reserve Police City Armed Reserve Police Rapid Action Force Quick Reaction Teams have been deployed !!
— BengaluruCityPolice (@BlrCityPolice) September 13, 2016












Click it and Unblock the Notifications