బస్సు బోల్తా, ఒకరి మృతి: భవనం కూలి 9 మంది

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద మంగళవారం ఉదయం వోల్వో బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని విజయవాడ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీ హరిప్రసాద్‌గా గుర్తించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు దగ్గర మంగళవారం ఉదయం ఆగి వున్న లారీని ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట పూతలపట్టు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెళ్లకూరు నుంచి నాయుడుపేటకు ప్రయాణికులతో వస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications