Viral Video:మేడమ్, పాస్ మార్కులు పెరుగుతాయా..? ఓ స్టూడెంట్ సందేహాం, వైరల్
ఇటీవల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవును వివిధ అంశాలతో ట్రోల్ అవుతున్నాయి. పెట్రోల్ ధరలకు అయితే హద్దే లేకుండా పోయింది. రోజు రోజు పైపైకి చేరుతున్నాయి. ఇక సిలిండర్ బండ ధర అయితే చెప్పక్కర్లేదు. దాని ధర కూడా ఆకాశాన్ని అటుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు.. పప్పు, పాల ధర కూడా పెరిగాయి. దీంతో సామాన్యుడు ఇబ్బందికి గురవుతున్నారు.

మేడమ్.. మేడమ్
దీనికి సంబంధించి ఓ విద్యార్థి వీడియో చేశాడు. 23 సెకన్ల డ్యూరేషన్ గల వీడియోలో.. చాలా అమాయకంగా టీచర్‌ను ప్రశ్నించాడు. మేడమ్.. మేడం అంటూ అడిగారు. ఆమె ఏదో.. సీరియస్ ఇష్యూపై మాట్లాడుతున్నారని అనుకుంది. కానీ పెట్రోల్, గ్యాస్ ధర గురించి అడిగారు. భయం అవుతుంది అని చెబుతాడు. తర్వాత ధర గురించి చెబుతాడు. అంతేకాదు పప్పు ధర, పాల ధర కూడా పెరిగాయని అంటాడు. అందుకే భయం వేస్తుందని తెలిపాడు

పాస్ మార్కులు పెరుగుతాయా..?
దానికి దీనికి ఏం సంబంధం రా నాయనా అని అంటే.. చావు కబురు చల్లగా చెబుతాడు. అదే తమ పాస్ మార్కులు కూడా పెరుగుతాయెమో అంటాడు. ఇప్పుడు 35 ఉండగా.. కష్టపడి చదువుతున్నాం అని చెబుతాడు. మరీ వాటిని 50 చేస్తే తమ పరిస్థితి ఏంటని అడుగుతాడు. చివరికీ పెరుగయి కదా మేడం అంటాడు. చాలు లేరా.. కూర్చొ, కూర్చొ అని టీచర్ అంటోంది. పెరగాయి లేరా నాయనా అని ఆమె అంటోంది. దాంతో ఆ విద్యార్థి కాస్త శాంతిస్తాడు.
ఇదీ విషయం
టీచర్‌ను అడిగితే ఏదో సీరియస్ ఇష్యూ అని అంతా అనుకుంటాం.. కానీ తన పాస్ మార్కుల గురించి ప్రస్తావిస్తాడు. అవును పాస్ మార్కులు పెంచితే ఎలా అని అడుగుతాడు. తాము నష్టపోతాం కదా అని చెబుతాడు. ఓరయ్యా.. అదేం పెరగదు లే అని ఆమె భరోసా ఇవ్వడంతోనే శాంతించాడు. అతనిది కూడా న్యాయబద్దమైన డిమాండ్ అనేవారు కూడా ఉన్నారు. అతను చదువు అంతంతమాత్రం ఉండటంతో.. అడిగాడని అనేవారు ఉన్నారు. లేదు.. భయంతో ఇలా చేశాడని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications