సభకు వెళ్లం, రోశయ్యకి అమ్మ చెప్పిందా: జగన్ ఆశ్చర్యం, ఈనాడుకు విజ్ఞప్తి
హైదరాబాద్: తాము రేపటి నుండి అసెంబ్లీకి వెళ్లడం లేదని, తాము సభాపతి కోడెల శివప్రసాద్ పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని, అది చర్చకు వచ్చినప్పుడే తాము సభకు వెళ్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.
ఈ రోజు అసెంబ్లీలో జరిగినదంతా మీరు గమనించారని అన్నారు. మమ్మల్ని సభ నుండి బలవంతంగా బయటకు పంపించారన్నారు. ఉన్నది ఒకే ప్రతిపక్షమైనప్పటికీ.. తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వకపోవడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షం చెప్పే మాటలు కూడా వినే ఓపిక లేదా అని ప్రశ్నించారు.
బడ్జెట్ పైన చర్చ జరిగితే లెక్కలతో సహా చెబుతాననే తమను బయటకు పంపించారన్నారు. 40 రోజులు జరగాల్సిన సమావేశాలను 17 రోజులకు కుదించారన్నారు. ప్రతిపక్షానికి గంట కన్నా ఎక్కువ సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు. తాను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే పదేపదే అడ్డుపడ్డారన్నారు.
నాలుగు రోజుల పాటు బడ్జెట్ పైన చర్చ అని, ఒక్క రోజుతో మమ అనిపించారన్నారు. తనకు ఇచ్చిన గంటలో పలుమార్లు అధికార పార్టీ అడ్డుపడిందన్నారు. ఎప్పటికప్పుడు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా, తాను మాత్రం సబ్జెక్ట్‌కే పరిమితమయ్యానని చెప్పారు.
తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను మాట్లాడుతుండగా.. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరులు పలుమార్లు తీసుకున్నారని, సమయంతో సహా జగన్ చెప్పారు. మంత్రులు అడ్డు తగలడాన్ని ప్రశ్నిస్తే తమ సభ్యులను ఎనిమిది మందిని సస్పెండ్ చేశారన్నారు.

దారుణంగా సభను నడపడమే కాకుండా, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. తాము రేపు అసెంబ్లీకి వెళ్లడం లేదని, సభాపతి కోడెల శివప్రసాద్ పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమను ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడో వెళ్తామని చెప్పారు.
అవిశ్వాసంపై చర్చకు వచ్చినప్పుడే సభకు వెళ్తామన్నారు. సభకు తాము వెళ్లమని, వాళ్ల గొంతే వినిపించుకోనియండని అన్నారు. వాళ్లే చర్చించుకోనీయండని విమర్శించారు. ఉన్న ఒక్క ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాము ప్రజలకు నేరుగా నిజాలు వెల్లడిస్తామని చెప్పారు.
తనను బెంగళూరు నుండి తీసుకు రావొద్దని రోశయ్య వద్ద తన తల్లి విజయమ్మ మొరపెట్టుకున్నట్లుగా చెప్పడం దారుణమన్నారు. తాను 1999 నుండి వైయస్ చనిపోయేదాకా తాను బెంగళూరులోనే ఉన్నానని, అలాంటప్పుడు ఇంత దారుణ ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
తనను వచ్చేలా చేయవద్దని రోశయ్యకు చెప్పేందుకు తన తల్లికి ఆయన ఏమైనా పెద్దనాన్ననా లేక చిన్నాన్ననా అని ఎద్దేవా చేశారు. తాను మొదటి నుండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని అని చెప్పారు. తాను అసలు శివశివానీ స్కూలులో చదవనే లేదని చెప్పారు.
తాను అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని దయచేసి మీడియా రిపీటెడ్‌గా వేయాలని, లేదా చివరి పది నిమిషాలైనా వేయాలని, ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. తాము వాస్తవాలు మాట్లాడుతుంటే అధికార పక్షం భయపడుతోందన్నారు. ఎమ్మెల్యేలు మనష్యులని కూడా చూడకుండా అధికార పక్షం దాడి చేయించిందన్నారు.
స్పీకర్ పైన అవిశ్వాస నోటీసును తాము అసెంబ్లీ కార్యదర్శికి ఇస్తున్నామని చెప్పారు. తాము గవర్నర్‌కు కూడా స్పీకర్ పైన ఫిర్యాదు చేశామని చెప్పారు. తాము ఏ విషయం మాట్లాడాలో స్పీకర్ చెప్పడమేమిటన్నారు. సభాపతి పైన పెట్టిన అవిశ్వాసం తీర్మానంలో తాము గెలిచినా, గెలవకపోయినా ఆయన తీరును మాత్రం తాము బయటపెడతామన్నారు.
తమ ఎమ్మెల్యేల బలం కేవలం 67గానే ఉందని, కాబట్టి గెలుస్తామో లేదో అన్నారు. టీడీపీని ప్రజలు నిలదీసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజా సమస్యల పైన నిలదీస్తే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. సభలో తాను మాట్లాడిన వీడియోలో ఎక్కడైనా తప్పు మాట్లాడినట్లు కనిపిస్తే తనను అడగవచ్చునన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో సభలో మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించారు.
ఆంధ్రజ్యోతి, ఈనాడులకు విజ్ఞప్తి
ఆంధ్రజ్యోతి, ఈనాడులకు వైయస్ జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తాను సభలో మాట్లాడిన గంట పాటు స్పీచ్ వేసినా వేయకపోయినా... చివరి పది నిమిషాల ప్రసంగం ప్రజలకు చూపించాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఉన్నప్పటికీ.. వారు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. టాపిక్ వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎత్తవలసి వచ్చిందని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications