హైద్రాబాద్‌లో రియల్ బూమ్, బాబు ఇవ్వకుంటే వదలం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, హైదరాబాద్ చుట్టు 10వేల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో అన్నారు. కబ్జాకు గురయ్యే అవకాశమున్న భూములను అమ్మేస్తామని చెప్పారు.
భూములను అమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేయగా... ఆ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం నుండే వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈసారి రూ.96వేల కోట్ల ప్రభుత్వ రాబడి ఉంటుందన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం బడ్జెట్ ప్లానింగ్ ఉంటుందన్నారు. వాటర్ గ్రిడ్ కోసం దాదాపు రూ.33వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు.

కృష్ణపట్నం విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినా తీసుకోమని కేసీఆర్ అన్నారు. ఆ విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణకు రూ.2500 కోట్లు మిగిలాయన్నారు. అయితే, సీలేరు విద్యుత్‌ను మాత్రం వదులుకోమన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్లో కోతలు విధించిందని కేసీఆర్ ఆరోపించారు. అదేవిధంగా కొంత మేర రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పారు.
రూ.79వేల కోట్లతో పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. వాటర్ గ్రిడ్ కోసం సుమారు రూ.33వేల కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతామని కేసీఆర్ చెప్పారు. విపక్షాలు లోపాలు వెతకడం మాని నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications