టిని వ్యతిరేకించి, అధిష్టానానికి సమాధానం చెప్తాం: బొత్స

విభజనపై అధిష్టానం నిర్ణయాన్ని తాము గౌరవిస్తామన్నారు. అయితే విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. అధిష్టానానికి తాము సమాధానం చెప్పుకుంటామని తెలిపారు.
పార్టీ బలోపేతం కోసమే తాము టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు సమీక్షించుకుంటూ భవిష్యత్తులో ఏం చేయాలో ఈ కమిటీ సూచిస్తుందన్నారు. పిసిసి కార్యదర్శులతో పాటు ఐదు కమిటీలు వేసినట్లు చెప్పారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా కమిటీలను వేశామన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం, పోల్ మేనేజ్‌మెంటు పైన తాము దృష్టి సారించామని, అందుకే కమిటీలు వేశామన్నారు.
తెలంగాణే: డిఎస్
రాయల తెలంగాణ ఇవ్వాలని సీమాంధ్ర నేతలు మంత్రుల బృందం (జివోఎం)పై ఒత్తిడి తెస్తున్నారని పిసిసి మాజీ చీఫ్, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ న్యూఢిల్లీలో అన్నారు. పది జిల్లాల తెలంగాణకే కేంద్రం మొగ్గు చూపుతుందని తాము భావిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications