నేరుగా నగదు రూపంలో: పింఛన్లపై యనమల

హైదరాబాద్: బ్యాంకర్లతో సమావేశం తర్వాత పంట రుణాల మాఫీపై విధివిధానాలు రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రుణమాఫీ కోసం బడ్జెట్‌ల 5 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

అదనంగా మరికొంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని యనమల అన్నారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్న కొత్త పింఛన్ల పథకానికి రూ. 5400 కోట్లు అవసరమని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు వస్తాయని ఆయన చెప్పారు. అక్టోబర్‌లో పింఛన్లను నేరుగా నగదు రూపంలో చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఎర్రచందనం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని యనమల చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తామని కూడా ఆయన అన్నారు.

We will pay cash: Yanamala

ఎపిలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రైతు భాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు ఎపి రైతు విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. జిల్లాల్లో సాగుబబడి గణనీయంగా పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం ేచశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+