కంచుకోటలో జగన్‌కు షాక్: 4 శాతం నమోదు, ఎందుకిలా?

వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకొన్న స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Recommended Video

    Poor response for YSR family programme కంచుకోటలో జగన్‌కు షాక్ | Oneindia Telugu

    కడప: వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకొన్న స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వైసీపీ చీఫ్ జగన్ స్వంత జిల్లా కడపలో కూడ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆశించిన మేర స్పందన రాలేదు.

    వైసీపీ చీఫ్ జగన్‌ పార్టీకి కడప జిల్లా కంచుకోట. కాంగ్రెస్ పార్టీని వీడి స్వంత పార్టీని ఏర్పాటుచేసుకొన్న సమయంలో కడప జిల్లా ప్రజలు వైసీపీ అభ్యర్థులుగా బరిలో దిగిన వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మను భారీ మెజారిటీతో గెలిపించారు.

    2014 ఎన్నికల్లో కూడ కడప జిల్లాలో టిడిపికి ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కింది. అయితే ఎన్నికల తర్వాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.

    అంతేకాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ టిడిపి అభ్యర్థి బీటెక్ రవి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ వివేకానందరెడ్డిపై పోటీచేసి విజయం సాధించారు. ఈ ఊపుతో 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో మరిన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు టిడిపి వ్యూహలు రచిస్తోంది.

    జగన్ కంచుకోటలో ఏం జరుగుతోంది?

    జగన్ కంచుకోటలో ఏం జరుగుతోంది?

    వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కంచుకోటగా కడప జిల్లాకు పేరుంది. అయితే ఈ జిల్లాలో వైసీపీకి బాగా పట్టుంది. ఇప్పటివరకు ఆ పట్టును కొనసాగిస్తోంది. అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీలో పేర్ల నమోదు కోసం ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమం కడప జిల్లాలో కూడ ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేదు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే తమ పేర్లను నమోదుచేసుకొన్నారని సమాచారం.ఏపీ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వైఎస్ఆర్ ఫ్యామిలీలో తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. కడప జిల్లాలో కూడ వైఎస్ఆర్ ఫ్యామిలీపై నేతలు ఆశించిన శ్రద్ద చూపడం లేదనే చర్చ వైసీపీలో నెలకొంది.

    ఇంటింటికి టిడిపి పై కేంద్రీకరించిన టిడిపి

    ఇంటింటికి టిడిపి పై కేంద్రీకరించిన టిడిపి

    ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని కడప జిల్లాలో విజయవంతం చేసేందుకు టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో టిడిపి శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.దీనికితోడు కడప జిల్లాలో త్వరలో ఇతర పార్టీల నుండి టిడిపిలో చేరికలు ఉండే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.ఇంటింటికీ టీడీపీ'' కార్యక్రమం జగన్ ఇలాకాలో సైతం జోరుగా సాగుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తన నియోజకవర్గమైన కడపలోనే కాకుండా జిల్లా అంతటా కలియతిరుగుతున్నారు.

    వైసీపీ నేతల్లో నిరుత్సాహం

    వైసీపీ నేతల్లో నిరుత్సాహం

    నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపాయి. అయితే అదే సమయంలో జగన్ పాదయాత్ర నిర్వహణకు సన్నాహకంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది.అయితే ఈ కార్యక్రమం కూడ ఆశించిన ప్రయోజనం కన్పించడం లేదు. వరుసగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూసింది.ఈ ప్రభావం వైసీపీపై కన్పిస్తోంది. టిడిపిలోకి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరనున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ కారణాలతో పార్టీ నేతలు వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమంపై అంతగా శ్రద్ద చూపడం లేదనే చర్చ కూడ లేకపోలేదు.

    రాయలసీమపై టిడిపి కన్ను

    రాయలసీమపై టిడిపి కన్ను

    రాయలసీమలో అనంతపురం జిల్లా మినహయించి ఇతర జిల్లాల్లో టిడిపి బలహీనంగా ఉంది. దీంతో మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు గాను టిడిపి నాయకత్వం వ్యూహన్ని రచిస్తోంది. ఇప్పటికే వైసీపీతో పాటు ఇతర పార్టీల్లో బలమైన నేతలను టిడిపి ఆహ్వనిస్తోంది. ఇందులో భాగంగానే కడప జిల్లాపై టిడిపి ప్రత్యేక దృష్టి పెట్టింది.ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+