కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి ముఖ్యమైన కారణం అదే?

మొదటి నుంచి జనసేన తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండే కన్నా చివరకు ఆ పార్టీలోనే చేరతారని, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారంటూ వార్తలు వచ్చాయి

ఉమ్మడి రాష్ట్రంలోని సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రం విభజనకు గురైన తర్వాత భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెంది ఈనెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. మొదటి నుంచి చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతుండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

జనసేనకు బీజేపీతో పొత్తుండటంతో..

జనసేనకు బీజేపీతో పొత్తుండటంతో..


మొదటి నుంచి జనసేన తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండే కన్నా చివరకు ఆ పార్టీలోనే చేరతారని, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే జనసేనకు బదులుగా టీడీపీ కండువా కప్పుకొని సత్తెనపల్లి నుంచి పోటీచేయాలనుకుంటున్నారు. అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న అంబటి రాంబాబుపై నియోజకవర్గస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీన్ని క్యాష్ చేసుకుంటే గెలుపు తథ్యమని నివేదికలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా సత్తెనపల్లిని తనకు కేటాయించాలని జనసేన కోరుతూ వస్తోంది. అయితే కన్నా టీడీపీలో చేరడం, సత్తెనపల్లి నుంచి పోటీచేయాలని యోచిస్తుండటంతో జనసేన ఈ సీటుపై పట్టుబట్టే అవకాశం కనిపించడంలేదు.

సోము వీర్రాజుతో విభేదించి..

సోము వీర్రాజుతో విభేదించి..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నా విభేదించారు. బహిరంగంగానే ఆయనపై వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ నాయకత్వం కన్నా వ్యాఖ్యలను పట్టించుకోలేదు. అధిష్టానం వివరాలు తెలుసుకున్నప్పటికీ కన్నాకు కౌంటర్ గా బీజేపీ నాయకులెవరూ మాట్లాడలేదు. అసలు ఏమైంది? కన్నా ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? జాతీయ కార్యవర్గంలో ఉన్న సీనియర్ నేతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఆయన్ను ఒప్పించి బీజేపీలోనే ఉంచేందుకు ఎందుకు ప్రయత్నించలేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.

జీవీఎల్ పై సెటైర్లు

జీవీఎల్ పై సెటైర్లు

జనసేన భారతీయ జనతాపార్టీతో పొత్తు కొనసాగిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలోకి వెళ్లడంకన్నా తెలుగుదేశం పార్టీలో చేరడం మంచిదనే అభిప్రాయానికి కన్నా వచ్చారు. తెలుగుదేశంలో కాపు సామాజికవర్గ నేతగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు సౌమ్యంగా వ్యవహరిస్తారు. సీనియర్ నేతగా గౌరవం లభిస్తుంది. వైసీపీవైపు కూడా చూసినప్పటికీ అక్కడ కూడా ఇదే కారణం. అంతర్గతంగా బీజేపీ వైసీపీకి సహకరిస్తోందని కన్నా భావన. దీంతో ఆయన చివరకు టీడీపీని ఎంచుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కాపు కోటాలో, సీనియర్ రాజకీయవేత్తగా మంత్రి పదవి దక్కుతుంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తే సునాయాసంగా అధికారం కైవసం చేసుకుంటాయని కన్నా భావన. జీవీఎల్ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, రంగాపేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశామన్నారు. అప్పుడే జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేదని, కొందరు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోదామనుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+