నిజాలు చేదు! పవన్ కళ్యాణ్‌ది ఆవేదన నుంచి వచ్చిన ఆక్రోశం!! ప్రశ్నించడం మినహా ఏం చేస్తారు?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ఏపీ టీడీపీ ఎంపీలకు, ఆంధ్రోళ్లు అనే మాటల పైన టీఆర్ఎస్ నేతలకు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఘాటైన చురకలు అంటించారు. దీనిపై టీడీపీ ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా పైన కావొచ్చు లేక ఆంధ్రోళ్లు అనే వ్యాఖ్యల పైన కావొచ్చు.. పవన్‌ది ఆవేదన లోనుంచి వచ్చిన ఆక్రోశం అని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా పైన ఏపీలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుపోయి ఉంది. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా పైన ఎలాంటి కదలిక లేదు.
అదే సమయంలో, ప్రత్యేక హోదా పైన సమయం వచ్చినప్పుడు అడుగుతున్న టిడిపి.. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతోంది. ప్రత్యేక హోదా పైన ఇప్పుడే తేల్చేందుకు బిజెపికి రాజకీయ కారణాలు ఉండవచ్చు. బీహార్ ఎన్నికలు, మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేయడం వంటి అనేక కారణాలు ఉండొచ్చు.

అదే సమయంలో ప్రత్యేక హోదా పైన టిడిపి నేతలు పార్లమెంటులో ప్రశ్నించారు. కేంద్రం పైన ఒత్తిడి చేస్తుండవచ్చు. కానీ, ప్రజల్లో మాత్రం ప్రత్యేక హోదా పైన తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొని ఉందని చెబుతున్నారు.
ప్రజలు బిజెపి రాజకీయ కోణం గురించి ఆలోచించరని, అలాగే టీడీపీ నిలదీసిందా లేదా అని చూడరని, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చారా, లేదా అన్నది మాత్రమే చూస్తారని చెబుతున్నారు. పవన్ కూడా ప్రజల కోణం నుంచి ప్రశ్నించారని, దానిని తప్పుపడితే ఎలా అని పవన్ అభిమానులు నిలదీస్తున్నారు.
ప్రత్యేక హోదా పైన ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పుడు ప్రశ్నిస్తే తప్పేమిటని అంటున్నారు. అసలు పవన్ ప్రచారం చేయకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదా అని నిలదీస్తున్నారు. అసలు, కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడవచ్చు కదా అని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్డీయేలో ఉంటూనే నిధులు రాబట్టుకోవాలనే టిడిడిపి ఆలోచనలో తప్పు లేదని, కానీ అంతకంటే ప్రత్యేక హోదా చాలా ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా పైన పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.
పవన్ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకే మద్దతు ఇచ్చారని, ఇంకా పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చెబుతున్నారు. అధికారంలో ఉన్న టిడిపి, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏం చేయలేకపోతున్నప్పుడు.. చట్టసభల్లో ఏమాత్రం ప్రాతినిథ్యం పవన్ ప్రశ్నించడం మినహా ఏం చేస్తారంటున్నారు.
ఇక, టీఆర్ఎస్ పార్టీకి చేసిన సూచనలను తప్పుపట్టడం కూడా సరికాదంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రతి దానికి ఆంధ్రోళ్లు, ఆంధ్రాబాబు అనడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కావాలనుకుంటే చంద్రబాబును, తనను నేరుగా తిట్టవచ్చునని పవన్ చెప్పారని గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రోళ్ల పంచాయతీ తెగలేదని, ఆంధ్రోళ్ల గొడవ ఉందని.. ప్రతి మాటకు ఆంధ్రోళ్లు.. లాంటి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని అంటున్నారు. ఆంధ్రోళ్లు అనకుండా నేరుగా ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబును తిట్టమనడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి విషయం కోర్టులో ఉన్నందున పవన్ కళ్యాణ్ స్పందించలేదని చెబుతున్నారు. దానిపై విమర్శలు చేయడం విడ్డూరమంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఏదో ఆశించే టీఆర్ఎస్‌లో ఎలా చేరారని ఇప్పటికే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అందులో రేవంత్ ఇష్యూ కూడా ఒకటి అని చాలామంది అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి నీతి, నిజాయితీలు లేవని, ఉన్న దాంట్లో ప్రజలు మంచి పార్టీని ఎన్నుకుంటున్నారని పవన్ చెప్పారని, ఈ దీనిని ఎవరైనా కాదనగలరా అని అంటున్నారు.
తాను కూడా గత ఎన్నికల్లోనే ఆ ఉద్దేశ్యంతోనే టీడీపీకి మద్దతిచ్చాననే భావన పవన్ కళ్యాణ్‌లో కనిపించిందని చెబుతున్నారు. హోదాపై ఏపీలో గూడుకట్టుకున్న ఆలోచనలను పవన్ చెప్పారంటున్నారు.
ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారని, చట్టసభల్లో బలం లేనందున ఆయన ఏం చేయలేరని, అసలు పవన్ పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేస్తున్నారు. అయితే, ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదని చెప్పిన పవన్, దానిని ఖండించారని, అలాగే, ఓటుకు నోటు పైన కూడా స్పందిస్తే బాగుండేదని ఇంకొందరు అంటున్నారు.
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications