నగ్నంగా ఫొటోలు దిగుతూ భార్య.., భర్త అనుమానం: బాత్రూంలోకి తోసి....

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పల్లవి అనే మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.

కర్నూలు: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పల్లవి అనే మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. తన బావతో కలిసి చంద్రమోహన్ అనే వ్యక్తి గొంతు కోసి తన భార్య పల్లవిని హత్య చేశాడు.

పల్లవి ప్రవర్తనలో మార్పు రావడంలేదని,, ఆమెను చంపకపోతే పరువు మంట గలుస్తుందని, తరచూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడు తోందని చంద్రమోహన్‌కు అతని అక్క, బావ, మేనమామ, మేనల్లుడు నూరి పోయడం హత్యకు దారి తీసినట్లు పోలీసులు కనిపెట్టారు.

కర్నూలులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మధవనగర్‌లో వారం రోజుల క్రితం పల్లవి హత్య జరిగింది. ఈ కేసులో ఐదుగురు నిందితు లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పల్లవి భర్త చంద్రమోహన్‌, ఆడ పడచు వసుంధర, ఆమె భర్త నరసింహ శాస్త్రి, వీరి కుమారుడు, భర్త మేనమామ జనార్దన్‌శర్మను త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి ఇన్‌చార్జి డీఎస్పీ వినోద్‌ కుమార్‌ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

అనుమానంతో తగాదా...

అనుమానంతో తగాదా...

కర్నూలుకు చెందిన చంద్రమోహన్‌కు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పల్లవితో 2010లో పెళ్లయింది. మూడేళ్ల నుంచి మాధవనగర్‌లో ఉంటున్నారు. చంద్రమోహన్‌ పురోహితుడు. వీరికి కుమారుడు కౌషిక్‌, కూతురుప్రసన్న ఉన్నారు. చంద్రమోహన్‌ మేనల్లుడు కూడా వీరి ఇంట్లోనే ఉంటూ పౌరోహిత్యం నేర్చుకుంటున్నాడు. చంద్రమోహన్‌ అక్క వసుంధర, బావ నరసింహాశాస్త్రి, మిట్టకందాలకు చెందిన మేనమామ జనార్ధన్‌ తరచూ వీరింటికి వచ్చిపోతుండే వారు.

ఎవరితోనో మాట్లాడుతుండడం...

ఎవరితోనో మాట్లాడుతుండడం...

కొద్ది రోజులుగా పల్లవి ప్రవర్తనలో మార్పు రావడాన్ని, తరచుగా ఆమె ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని చంద్రమోహన్ బంధువులు గమనించారు. చంద్రమోహన్‌కు ఈ విషయాన్ని తరచూ చెబుతుండే వారు. పల్లవి తన నగ్న చిత్రాలను ఎవరికో వాట్సాప్‌లో పంపడం తాను చూశానని మేనల్లుడు కూడా పదే పదే చెబుతూ వచ్చాడు.గత నెల 26న చంద్రమోహన్‌ తిరుపతికి వెళ్లగా, పల్లవి మరో వ్యక్తితో ఇంట్లో ఉండటాన్ని వాళ్లు చూశారు.

పంచాయతీ పెట్టారు...

పంచాయతీ పెట్టారు...

చంద్రమోహన్‌ వచ్చిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అప్పటి నుంచి వీరి మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. భర్త చంద్రమోహన్‌ పల్లవిని సిగరెట్లతో కాల్చి శారీరకంగా హింసించి పుట్టింటికి పంపించాడు. పెద్ద మనుషులు మరోసారి పంచాయితీ చేసి ఈ నెల 10న పల్లవిని భర్త వద్ద వదిలివెళ్లారు. దీంతో అక్క, బావ, మేనమామ, మేనల్లుడు పల్లవి మనతో పాటు ఉంటే పరువు పోతుందని, చంపేద్దామని చంద్రమోహన్‌తో చెప్పారు. దానికి అతను అంగీకరించాడు.

పథకం ప్రకారం ఇలా....

పథకం ప్రకారం ఇలా....

పథకం ప్రకారం చంద్రమోహన్ తన అక్క, మేనల్లుడు, మేనమామలను మిట్టకందాలకు పంపించాడు. ఈ నెల 12 మధ్యాహ్నం 2 గంటల సమయంలో పల్లవి కొడుకును పాఠశాలలో వదిలి ఇంటికి వచ్చింది. అరగంట తర్వాత బాత్‌ రూమ్‌కు వెళ్లింది. అప్పటికే కొత్త కత్తితో సిద్ధంగా ఉన్న చంద్రమోహన్‌, ఆయన బావ నరసింహ శాస్త్రి టీవీ సౌండ్‌ పెంచేసి బాత్‌రూం దగ్గరకు వెళ్లారు. వీరి రాకను పల్లవి గుర్తించే లోపే ఆమె జుట్టు పట్టుకొని బాత్‌రూంలోకి తోశారు. కింద పడిన పల్లవి చేతులను నరసింహ శాస్త్రి గట్టిగా పట్టుకోగా, చంద్రమోహన్‌ పల్లవి గొంతు కోశాడు. గాయాలతో పడి ఉన్న ఆమె గుండెలపై కత్తితో పొడిచాడు. పల్లవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కాళ్లు చేతులకు అంటిన నెత్తుటి మరకలను కడిగేసుకున్నారు.

ఆ తర్వాత ఇలా...

ఆ తర్వాత ఇలా...

నిద్రలో ఉన్న చిన్నారి ప్రసన్నను తీసుకుని కారులో మిట్టకందాలకు బయలుదేరారు. అక్క వసుంధర, మేనమామ జనార్దన్‌, మేనల్లుడు కలిసి ఏం తెలియనట్లు వీరింటికి వచ్చారు. నేరుగా బాత్‌ రూం దగ్గరకు వెళ్లి రక్తపు మడుగులో ఉన్న పల్లవిని చూసి ఆత్మహత్య చేసుకుందని హడావిడి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసుల విచారణలో వారు చేసిన ఘోరం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+