వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి కొత్త వాదన!: మోడీ వద్దకు.. చిరంజీవి-పవన్ కళ్యాణ్ కలిసేనా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమను నిలదీసిన నేపథ్యంలో టిడిపి (కొంతమంది) ఆయన పైన ఎదురు దాడికి దిగారు. ప్రత్యేక హోదా అంశంపై తమను తప్పు పట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోని అంశమని, నాడు బీజేపీ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్రం పైన ఒత్తిడి తేవాలని అంటున్నారు. అందుకోసం అవసరమైతే అందరం కలిసి పోరాడుదామని చెబుతున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

నువ్వెంత.. నీ లెక్కెంత: పవన్‌పై టిడిపి ఆగ్రహం వెనుక! 2 వ్యూహాలునువ్వెంత.. నీ లెక్కెంత: పవన్‌పై టిడిపి ఆగ్రహం వెనుక! 2 వ్యూహాలు

ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తానంటే తాను చంద్రబాబుకు కటీఫ్ చెప్పి తాను ఆయన పక్కన చేరిపోతానని రెండు రోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాస్, కేశినేని నాని కూడా అవే వ్యాఖ్యలు చేశారు. తమను టార్గెట్ చేసినందుకు కొందరు ఎంపీలు ఆయన పైన దుమ్మెత్తి పోశారు.

Will Chiranjeevi, Pawan Kalyan fight together for Special Status to AP?

తాజాగా, టిడిపి నేతలు మరో ఆసక్తికర వాదన తెరపైకి తెచ్చారు. హోదా కోసం తాము పోరాటం చేస్తున్నామని, అవసరమైతే పదవులకు కూడా రాజీనామా చేస్తామని చెబుతున్న ఎంపీలు.. ఈ అంశంపై కాంగ్రెస్ నేత చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు తమతో కలిసి వస్తే మరోసారి ప్రధాని మోడీని కలుద్దామని చెప్పారు. హోదా కోసం పలుమార్లు ప్రధానిని కలిశామని, సీఎం చంద్రబాబు కూడా కలిశారని చెబుతున్నారు.

టిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహంటిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహం

అన్నదమ్ములుగా ఒక్కటే, రాజకీయ దారులు వేరు.. మరి!

కుటుంబ సభ్యులుగా, అన్నదమ్ములుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ రాజకీయంగా మాత్రం వేర్వేరు దారులు. ఈ విషయాన్ని పవన్ చెప్పారు. అయితే, హోదా మాత్రం ఏపీకి సంబంధించిన అంశం. ఆరు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. కాబట్టి హోదా కోసం ఇరువురు కలుస్తారా చూడాలని అంటున్నారు. హోదా కోసం తాను ఏ పార్టీతోనైనా కలుస్తానని పవన్ చెప్పారు.

English summary
Will Chiranjeevi, Pawan Kalyan fight together for Special Status to AP?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X