అవిశ్వాసానికి దూరం: కిషన్ రెడ్డి, వెంకయ్యతో టిడిపి భేటీ

యుపిఎ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని, అందువల్ల ప్రత్యేకంగా పనిగట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెట్టే ఏ అవిశ్వాసానికైనా తమ పార్టీ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు. కేవలం రోజులు లెక్కపెట్టే ప్రభుత్వంగా యుపిఎ మారిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఆధిపత్యం కోసం జరుగతున్న ఆరాటమే తప్ప ఇది సమైక్యవాదం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలకోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే చర్చలో కచ్చితంగా పాల్గొంటామని, యుపిఎ విధానాలను ఎండగడుతామని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఢిల్లీలో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడిని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కలిశారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీతో కూడా వారు సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, కొనకళ్ల నారాయణ వారిని కలిశారు. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వారు బిజెపి అగ్రనేతలను కోరారు.












Click it and Unblock the Notifications