Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జైల్లో చంద్రబాబు, ఆంధ్రా బంద్, బాబు అడ్డా కుప్పంలో ఇది పరిస్థితి, ఎక్కడికక్కడే అంతా !

కుప్పం/రాజమండ్రి: తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విదించింది. చంద్రబాబు అరెస్టుకు వైసీపీ కుళ్లు రాజకీయాలు కారణం అని ఆరోపిస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్ కు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న బంద్ కు మిశ్రమ స్పందన వస్తోంది. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు నియోజక వర్గం కావడంతో కుప్పంలో అదనపు పోలీసు బలగాలు మొహరించాయి,

With the Andhra Pradesh bandh, there is a tense atmosphere in Kuppam, all shops are closed

కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ నియోజక వర్గంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుప్పంలో టీడీపీ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకుల నిరసనలు చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు.

కుప్పం పట్టణంలోని ఎన్ టీఆర్ సర్కిల్ లో టీడీపీ నాయకులు టెంట్లు వేసుకుని ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు ధర్నాలు చెయ్యడానికి అనుమతి లేదని టెంట్లు తొలగించి టీడీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆ పార్టీ నాయకులు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డిని సంప్రధించి ధర్నాకు అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.

పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి అనుమతి ఇవ్వడంతో కుప్పంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఇదే సమయంలో కుప్పంలో కొందరు టీడీపీ నాయకుల హౌస్ అరెస్టుల పర్వం సోమవారం కూడా కొనసాగుతున్నాయి.

With the Andhra Pradesh bandh, there is a tense atmosphere in Kuppam, all shops are closed

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని, మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఆర్ టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బంద్ సందర్బంగా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు, పలమనేరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కుప్పంకు అదనపు పోలీసు బలగాలు రప్పించారు. కుప్పంలో పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా సోమవారం ఉదయం నుంచి దుకాణాలు మూసివేశారు. కుప్పంలోని నాలుగు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+