ప్రమాదంలో భర్త మృతి: పిల్లలతో భార్య ఆత్మహత్య
శ్రీకాకుళం: భర్త లేకుండా బతకలేననే వేదనతో ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మునపాడు గ్రామానికి చెందిన కళింగ వెంకటేశ్వరరావు (35), విజయనగరం పట్టణానికి చెందిన శ్రావణి (27) ప్రేమించుకున్నారు. కులాలు వేరనే నెపంతో ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. అయినా జంట ఆరేళ్లక్రితం పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు సాయిదర్శిని(4), శ్రీనివాసులు(1) అనే పాప, బాబు పుట్టారు. విజయనగరం పట్టణంలోని ఎస్.వి.ఎన్. నగర్, వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో కాపురముంటున్నారు.
అయితే వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు కుమారుడి వద్దకు రావడం లేదు. శ్రావణి తల్లిదండ్రులు రెండేళ్లపాటు దూరంగా ఉన్నా ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో డిసెంబర్ 19న వెంకటేశ్వరావు శ్రీకాకుళం జిల్లా సోంపేట వద్ద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి శ్రావణి దిగులుగా ఉంటోంది. సంఘటన జరిగిన నాటి నుంచి ఆమె తల్లి లక్ష్మి శ్రావణికి తోడుగా ఉంటోంది.

పదే పదే తన భర్త తీపి గురుతులను తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. బిడ్డలను తడిమి తడిమి కుమిలి పోయేది. భర్త మరణించిన పది రోజులయ్యింది. ఈ పది రోజుల్లోనే ఎడబాటును భరించలేక పోయింది. ఓ నిర్ణయానికి వచ్చేసింది. శ్రావణి తండ్రి రామకృష్ణ బాలాజీ మార్కెట్‌లో చిన్న బట్టల షాపును నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రామకృష్ణ దుకాణాన్ని వెళ్తున్న సమయంలో నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు. ఆయనకు సాయంగా వెళ్ళాలని తన తల్లి లక్ష్మికి చెప్పింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు దుకాణానికి వెళ్లారు.
ఆ తరువాత బిడ్డలను చూసి శ్రావణి ఏడ్చింది. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఒకటికి రెండు మార్లుగా తడిమి తడిమి చూసుకుంది. కూల్ డ్రింక్స్ లో విషం కలిపి తాగించింది. భర్త లేని ఈ జీవితం వృధా అని భావించిన శ్రావణి తానూ ఫ్యాన్ కు ఉరి వేసుకుని తనువు చాలించింది. ఒక్కతే ఉంది కదాని 11 గంటల ప్రాంతంలో శ్రావణి తండ్రి ఫోన్ చేశాడు. సమాధానం లేదు. మళ్లీ ఒంటిగంట సమయంలో ఫోన్‌చేశాడు. అప్పుడూ ఫోన్ ఎత్తలేదు. మూడు గంటల సమయంలో ఫోన్ చేశాడు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో మూడున్నర గంటల సమయంలో ఇంటికివచ్చి తలుపులు తట్టాడు. తలుపులు తీయలేదు.
కిటికీ తలుపు తెరచి చూడగా శ్రావణి ఫ్యానుకు వెలాడుతోంది. తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన శ్రీనివాసులు నిశ్చేష్టుడయ్యాడు. ఇద్దరు పిల్లలు జీవశ్ఛవాల్లా పడి ఉన్నారు. వారి నోటి నుంచి నురుగులు వస్తున్నాయి. పక్కనున్ననోట్ పుస్తకంలో పెన్సిల్‌తో ‘‘ నన్ను క్షమించండి.., నాభర్త లేకుండా నేను, నా పిల్లలు ఉండలేము. అందుకే ఇలా చేస్తున్నాను. అందరికీ సెలవు..!!, మీశ్రావణి అని రాసి ఉంది.












Click it and Unblock the Notifications