పీక కోసి మహిళ హత్య, ముఖం కాల్చివేత: రేప్ చేసి హత్య?

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బ్లేడ్‌తో పీక కోసి మహిళను హత్య చేశారు. ముఖం నల్లగా మాడిపోయి ఉంది. దాంతో హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు గుర్తించకుండా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు.

డౌనూరు - రొబ్బసింగి దారిలో జీడీతోటల పక్కన బుధవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలి వయస్సు దాదాపు 33 ఏళ్లు ఉంటుందని అంచనా. డి. ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన జీడి మామిడి తోటలో ఈ సంఘటన జరిగింది.

ఆయనే సమాచారం ఇచ్చారు.

ఆయనే సమాచారం ఇచ్చారు.

తన తోటలో మృతదేహం ఉందనే సమాచారాన్ని ప్రసాద్ కొయ్యూరు పోలీసులకు అందించారు. అనకాపల్లి డిఎస్పీ రమణ, కొయ్యూరు సిఐ ఉదయ్ కుమార్, ఎస్ఐ రుక్మాందరావు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

గుర్తు పట్టలేని స్థితిలో శవం

గుర్తు పట్టలేని స్థితిలో శవం


హత్యకు గురైన మహిళన గుర్తు పట్టలేని స్థితి ఉంది ముఖం పూర్తిగా మాడిపోవడంతో స్థానికులు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోయారు. తొలుత అత్యాచారం చేసి ఆ తర్వాత బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోస్టుమార్టం నివేదిక వస్తే...

పోస్టుమార్టం నివేదిక వస్తే...

పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని భావిస్తున్నారు. మృతదేహానికి సమీపంలో ఓ బీరు సీసా దగ్గరలో ఓ లిమ్కా ఖాళీ సీసా, దూరంగా రెండు థమ్సప్ సీసాలు ఉన్నాయిి. రెండు ప్లాస్టిక్ గ్లాసులు లభించాయి.

పథకం ప్రకారమే చేసి ఉంటారు....

పథకం ప్రకారమే చేసి ఉంటారు....

మహిళను పథకం ప్రకారం అక్కడికి తీసుకుని వచ్చిన అత్యాచారం చేసి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. రెండు రోజుల కిందట ఈ సంఘటన జరిగి ఉంటుందని కొయ్యూరు ిఐ ఉదయ్ కుమార్ బుధవారం రాత్రి చెప్పారు.

Recommended Video

    Facebook Friend Murder Hyderabad | ఫేస్‌బుక్‌ ఫ్రెండే హంతకుడు - Oneindia Telugu
    మహిళ మైదానం ప్రాంతం నుంచి...

    మహిళ మైదానం ప్రాంతం నుంచి...


    మహిళ చిలకపచ్చ రంగు చీర ధరించింది. రెండు కాళ్లక కడియాలున్నాయి. కాలి వేళ్లకు మట్టెలున్నాయి. దాంతో ఆమె వివాహిత అని భావిస్తున్నార. మృతురాలు మైదాన ప్రాంతానికి చెందిందని అనుకుంటున్నారు. బుధవారం సాయంత్రం క్లూస్ టీమ్ పరిశీలించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+