అనంతలో దారుణం:మహిళపై అత్యాచారం, ఆపై హత్య!
అనంతపురం: అనంతపరం జిల్లాలోని పరిగి మండలం శాసనకోటలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీదేవమ్మ అనే అంగన్ వాడీ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్యచేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. అయితే లక్ష్మీదేవమ్మను దుండగులు అత్యాచారం చేసిన అనంతరం హత్యచేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహన్ని పొస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications