మెడపై కత్తితో నరికి భర్తను చంపిన భార్య
విశాఖపట్నం: వేధింపులు భరించలేక ఓ మహిళ భర్తను కత్తితో నరికి చంపింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలంలోని సంకాడ కొత్తూరులో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోమరాజు (32) అనే వ్యక్తిని అమ్మాజి అనే మహిళ నరికి చంపింది.
సోమరాజుతో అమ్మాజీకి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు, కుటుంబాన్ని భర్త సరిగా పట్టించుకునేవాడు. కూలి పనులకు వెళ్లి అమ్మాజీ కటుంబాన్ని నెట్టుకొస్తోంది. సోమరాజు రోజూ చిత్తుగా మద్యం తాగి వచ్చి అనుమానంతో అమ్మాజీని వేధించేవాడు. దాంతో ఆమె తీవ్ర వేదనకు గురవుతూ వచ్చింది.

ఈ స్థితిలో గురువారం ఉదయమే చిత్తుగా మద్యం తాగి వచ్చిన సోమరాజు భార్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. దాంతో ఇరువురి మధ పెనుగులాట జరిగింది. తనను కాపాడుకునేందుకు అమ్మాజీ భర్తపై తిరగబడింది. అతని చేతిలోని కత్తిని లాక్కుని ఎదురుదాడి చేసింది.
అతని మెడపై కత్తితో వేటు వేసింది. సోమరాజు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. సమాచారం మేరకు ఎస్ఐ నరసింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications