ధూంధాం: అలరించిన మహిళల నృత్యాలు(పిక్చర్స్)
విశాఖపట్నం: మహిళల నృత్యాల సందడితో నగరంలోని హోటల్ దసపల్లా మార్మోగిపోయింది. శ్రీవాసవి స్నేహాలయం మహిళా ఆధ్వర్యంలో బుధవారం ‘మహిళా ధూమ్‌ధామ్' పేరిట నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో మహిళలు తమదైన శైలిలో ప్రతిభను కనబరిచి ఆహుతులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హోమియో వైద్యుడు కె. వెంకన్నశెట్టి మాట్లాడుతూ.. ప్రతి మహిళలో సృజనాత్మకత దాగివుంటుందని, వారికి కుటుంబసభ్యులు ప్రోత్సాహాన్ని అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఇలాంటి సాంస్కృతిక పోటీలు మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయన్నారు.
సంస్థ అధ్యక్షురాలు సివిఎన్ విశాలాక్షి మాట్లాడుతూ.. ఈ పోటీలు ద్వారా వచ్చే నగదును పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి సత్యనారాయణమూర్తి, రోటరీ వాల్తేర్ మాజీ అధ్యక్షుడు గరుడా రత్నం పాల్గొన్నారు. అనంతరం మహిళలు వివిధ పోటీల్లో పోటాపోటీగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చివరగా విజేతలకు బహుమతులను అందజేశారు.

ధూమ్‌ధామ్
మహిళల నృత్యాల సందడితో నగరంలోని హోటల్ దసపల్లా మార్మోగిపోయింది.

ధూమ్‌ధామ్
శ్రీవాసవి స్నేహాలయం మహిళా ఆధ్వర్యంలో బుధవారం ‘మహిళా ధూమ్‌ధామ్' పేరిట నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో మహిళలు తమదైన శైలిలో ప్రతిభను కనబరిచి ఆహుతులను ఆకట్టుకున్నారు.

ధూమ్‌ధామ్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హోమియో వైద్యుడు కె. వెంకన్నశెట్టి మాట్లాడుతూ.. ప్రతి మహిళలో సృజనాత్మకత దాగివుంటుందని, వారికి కుటుంబసభ్యులు ప్రోత్సాహాన్ని అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు.

ధూమ్‌ధామ్
ఇలాంటి సాంస్కృతిక పోటీలు మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయన్నారు.

ధూమ్‌ధామ్
సంస్థ అధ్యక్షురాలు సివిఎన్ విశాలాక్షి మాట్లాడుతూ.. ఈ పోటీలు ద్వారా వచ్చే నగదును పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు.

ధూమ్‌ధామ్
అనంతరం మహిళలు వివిధ పోటీల్లో పోటాపోటీగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చివరగా విజేతలకు బహుమతులను అందజేశారు.












Click it and Unblock the Notifications