ఆ నియోజకవర్గంలో వైసీపీకి షాక్

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ప్రజల్లో బలమున్న నేతలపై ఆయా పార్టీలు తమ దృష్టిని సారించాయి. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలకు పలు పార్టీలు గాలం వేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలపై టీడీపీ గురి పెట్టింది. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ తమ పార్టీలో చేర్చుకుని అధికార పార్టీకి షాకిచ్చింది.

తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ప్రారంభం అయ్యాయి. కొండ్లపూడి గ్రామ సర్పంచ్ కుమారుడు, కుమార్తె వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరితో పాటు ఇద్దరు వార్డు మెంబర్స్‌ సైతం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

YCP activists and leaders joined TDp

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికు అతి పెద్ద విజయాన్ని అందించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యనించారు. ఎన్నికల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో జెండా మోయడానికి కూడా ఎవరూ మిగలరని కోటంరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును సీఎం కావాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన కోటంరెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు.

రాబోవు ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఎన్నికలు కోటంరెడ్డికి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన నెల్లూరు వైసీపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీలోని ముఖ్య నేతలను టీడీపీలోకి తీసుకువచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే సోమవారం పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+