ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల ఖర్చా? అనుకూల మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం:ఎమ్మెల్యే ఆళ్ల
విజయవాడ:మంగళగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు నువ్వు ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల రూపాయల ఖర్చా?...నీ మంత్రి పుచ్చి పోయిన పంటికి వైద్యం చేయించుకోవడానికి లక్షల రూపాయల ఖర్చా?...ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నువ్వు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టడం సబబేనా చంద్రబాబూ అని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పార్క్ హయత్ హోటల్లో నీ కుటుంబానికి మూడు సూట్‌లు బుక్ చేసి ప్రభుత్వ సొమ్ము దుబారా చేయడం వాస్తవం కాదా?... అని ఆర్కే నిలదీశారు.

మోసాలే...చంద్రబాబు నైజం
చంద్రబాబు మైండ్ పనిచేయటం లేదని...తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడమే బాబు నైజమని ఆర్కే విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ బులెటిన్‌లో ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని మా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌గా చూపుతున్నారని వెల్లడించారు.

జీతాల గురించి...ఆ హక్కు లేదు
మా జీతాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, నువ్వు తప్పు చేసినట్లు లెంపలేసుకోవాలని చంద్రబాబుకు ఆర్కే హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు జగన్ ఇచ్చిన బీఫారం మీద గెలిచిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు.

ఆ సంగతి...గుర్తు లేదా?
చంద్రబాబు చెప్పటానికే నీతులు..ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకున్న సంగతి గుర్తులేదా అని సూటిగా అడిగారు. జీతం అనేది ఎమ్మెల్యేలకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అసెంబ్లీకి వెళ్తే ఇచ్చేది కేవలం భత్యమే అని ఆర్కే వివరించారు.

స్పీకర్ నుంచి...తప్పించండి
ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని ఆర్కే డిమాండ్ చేశారు. జగన్ సభకు వస్తే హడావుడిగా ముగిస్తారు..ఇప్పుడు వారం రోజులు శాసనసభ నిర్వహిస్తారా?...అని నిలదీశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications