వేధింపులు: కోచింగ్ సెంటర్‌లో యువకుడిపై సుత్తితో దాడి చేసిన యువతి
అమరావతి: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఓ యువకుడిపై యువతి సుత్తితో దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో చోటు చేసుకంది. మార్కాపురంలోని మైస్ కోచింగ్ సెంటర్‌లో యువకుడిపై యువతి సుత్తితో దాడి చేసింది.
ఈ దాడి ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, విద్యార్థులు గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యవకుడు మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రేమ పేరుతో తనను వేధిస్తున్నాడని, అతడి వేధింపులు తట్టుకోలేకదాడికి దిగానని సదరు యవతి పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications