రాజ్‌భవన్ ముందు కడప వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్ ఎదుట ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తనపై వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అతను డిమాండ్ చేశాడు. తనను స్థానిక సిఐ వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని గవర్నర్‌కు చెబుతానని ఆయన రాజ్ భవన్‌కు చేరుకున్నాడు.

తనను లోనికి అనుమతించాలని భద్రతా సిబ్బందిని కోరాడు. వారు నిరాకరించడంతో అతను తన వెంట తెచ్చుకున్న పరుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న పోలీసులు అతనిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్.

Youth tries to commit suicide at Raj Bhavan

వెండి స్వాధీనం

కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పెద్ద మొత్తంలో వెండి బయటపడింది. కారులో తరలిస్తున్న ఇరవై అయిదు కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

కర్నూలు జిల్లాలో గడివేముల మండలం వండుట్ల గ్రామం వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+