ప్రచారం: భర్త వైయస్ జగన్ కోసం వైయస్ భారతి
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతుగా ఆయన సతీమణి వైయస్ భారతి కూడా ప్రచార బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్‌తో పాటు ఆయన తల్లి వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిల ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. తాజాగా వైయస్ భారతి రంగంలోకి దిగారు.
వైయస్ భారతి గురువారంనాడు ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారం చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశఆరు. తమ పార్టీకి సీమాంధ్రలో 135 నుంచి 140 స్థానాలు వస్తాయని ఆమె చెప్పారు.

ప్రచారంలో భారతితో పాటు వైయస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, బద్వేల్, కడప నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం సాగించారు. ఈ నెల 2వ తేదీన బద్వేల్, 3వ తేదీన కడప నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
వైయస్ భారతి ప్రధాన కడప జిల్లాపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తున్నారు. వైయస్ విజయమ్మ, జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రచారం సాగిస్తుండగా, వైయస్ షర్మిల, భారతి పోటీ చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications