అవ్వ చేతులు చూసి.. జగన్: షర్మిల రోడ్‌షో(పిక్చర్స్)

కడప: కేవలం మూడు వారాలు ఓపిక పట్టండంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఓదార్చారు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలు తీరుస్తానని అన్నారు. శుక్రవారం కడప జిల్లాలోని పులివెందులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నోటికొచ్చిన హామీలుస్తున్నారని ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు ఆడనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కుళ్లు, కుతంత్రాలకు సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.

పెద్దదుద్యాల గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడుతుండగా.. సమీపంలో పొలం పనులు చేసుకుంటూ ఉన్న ఓ వృద్ధురాలు జగన్ దగ్గరికి వచ్చారు. జగన్ ఆమె చేతులను చూసి.. అవ్వా నీ చేతులు ఇలా అయిపోయాయి ఏంటి అని అడిగారు. తన చేతులు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ‘20 రోజులు ఆగవ్వా.. నేను ముఖ్యమంత్రిని కాగానే పింఛన్ పెంచడంతోపాటు అందరి కష్టాలు తొలగిపోయేలా కృషి చేస్తాను'అని జగన్ చెప్పారు. దీంతో ఆ అవ్వ చల్లగా ఉండాలని జగన్మోహన్ రెడ్డిని దీవించారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ శుక్రవారం విశాఖపట్నం లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటల్లో నిర్వహించిన వైయస్సార్ జనభేరీ సభల్లో ప్రసంగించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఈ ప్రాంత ప్రజలతో ఆయనది విడదీయలేని అనుబంధమని చెప్పారు. తెలంగాణ అభిమానంతోనే వైయస్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మా కుటుంబం తెలంగాణ ప్రాజలకు రుణపడి ఉంటుదని చెప్పారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

శుక్రవారం కడప జిల్లాలోని పులివెందులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ రోడ్‌షో నిర్వహించారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

కేవలం మూడు వారాలు ఓపిక పట్టండంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఓదార్చారు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలు తీరుస్తానని అన్నారు.

అవ్వ చేతులు చూసి...

అవ్వ చేతులు చూసి...

పెద్దదుద్యాల గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడుతుండగా.. సమీపంలో పొలం పనులు చేసుకుంటూ ఉన్న ఓ వృద్ధురాలు జగన్ దగ్గరికి వచ్చారు. జగన్ ఆమె చేతులను చూసి.. అవ్వా నీ చేతులు ఇలా అయిపోయాయి ఏంటి అని అడిగారు. తన చేతులు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నోటికొచ్చిన హామీలుస్తున్నారని జగన్ ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు ఆడనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కుళ్లు, కుతంత్రాలకు సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.

ఫ్యాన్ చూపిస్తున్న షర్మిల

ఫ్యాన్ చూపిస్తున్న షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటల్లో నిర్వహించిన వైయస్సార్ జనభేరీ సభల్లో ప్రసంగించారు.

షర్మిల ప్రసంగం

షర్మిల ప్రసంగం

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఈ ప్రాంత ప్రజలతో ఆయనది విడదీయలేని అనుబంధమని షర్మిల చెప్పారు. తెలంగాణ అభిమానంతోనే వైయస్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మా కుటుంబం తెలంగాణ ప్రాజలకు రుణపడి ఉంటుదని చెప్పారు.

రోడ్‌షోలో విజయమ్మ

రోడ్‌షోలో విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ శుక్రవారం విశాఖపట్నం లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+