రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమే?: రూల్ చదివి వినిపించిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు మూడో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రోజా సస్సెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
దీనికి సంబంధించి శాసనసభకు సంబంధించిన క్లాజ్‌ను చదివి వినిపించారు. అందులో కేవలం శాసనసభ సమావేశాలు ముగిసే వరకే ఏ సభ్యుడునైనా సస్పెండ్ చేసే అవకాశం స్పీకర్‌కు ఉందని, అలాంటి మీరు ఏడాది పాటు రోజాను ఎలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు.

నిబంధనల ప్రకారమే సభ నడవాల్సింది ఉందని సూచించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా మా సభ్యురాలిని సస్పెండ్ చేశారని అన్నారు. అనంతరం దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ వ్యవహారల మంత్రి యనమలను స్పందించాల్సిందిగా కోరారు.
రోజా సస్పెన్షన్‌పై మంత్రి యనమల మాట్లాడుతూ ఇది ఒక స్పీకర్ లేదా ఓ సభ్యుడో తీసుకున్న తీసుకున్న నిర్ణయం కాదన్నారు. సభలో తీసుకున్న నిర్ణయాలపై స్పీకర్‌కు పవర్ లేదన్నారు. సభ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కూడా జోక్యం చేసుకోదని అన్నారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని సభ నిర్ణయమని తెలిపారు.
సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యే మూడో రోజు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. దీంతో రోజాను అసెంబ్లీని వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందితో రోజా వాగ్వాదానికి దిగారు. సస్పెండ్ అయిన సభ్యులను లోపలికి రానివ్వొద్దంటూ సిబ్బంది ఆదేశాలున్నాయని రోజాకు సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన మహిళా మార్షల్స్ రోజాను బయటకు గేంటేశారు. కాగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
నిన్నటిదాకా కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సమగ్ర చర్చకు డిమాండ్ చేసిన వైసీపీ, రోజా సస్పెన్షన్‌తో షాక్‌కు గురైంది. అంతేకాక కాల్ మనీపై చర్చ కొనసాగిస్తూనే, రోజా సస్పెన్షన్ నే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుంది. దీంతో ఈరోజు అసెంబ్లీలో రోజా సస్పెన్షన్‌పై దద్దరిల్లుతోంది.












Click it and Unblock the Notifications