మింగుడుపడని పవన్ కళ్యాణ్: కన్నేసి ఉంచిన జగన్, ఆరా తీస్తున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కదలికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేసి ఉంచిందని అంటున్నారు. 2019లో పోటీ చేస్తానని పవర్ స్టార్ చెప్పడంతో ఇప్పటికే టిడిపి, బిజెపి లెక్కలు వేసుకుంటోంది.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కదలికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేసి ఉంచిందని అంటున్నారు. 2019లో పోటీ చేస్తానని పవర్ స్టార్ చెప్పడంతో ఇప్పటికే టిడిపి, బిజెపి లెక్కలు వేసుకుంటోంది. జగన్ కూడా ఆయనపై కన్నేసి ఉంచారని అంటున్నారు.
ఎంతలా అంటే, ఇటీవల పవన్ నటించిన కాటమరాయుడు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత దాని కలెక్షన్ల గురించి, సినిమా ఆధరణ గురించి జగన్ ప్రత్యేకంగా తెలుసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ సినిమా గురించి జగన్ ఆరా తీయడంతో సొంత ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారట.

కాటమరాయుడుపై జగన్ ఆరా.. ఏ లెక్క కోసమో?
కాటమరాయుడు సినిమా విడుదలకు ముందు జరిగిన సినిమా ప్రీ రిలీజ్ వేడుక, ఆ వేడుకలో టీవీ 9 రవిప్రకాశ్ స్పీచ్ తదితర అంశాలతో పాటు, ఆ ఫంక్షన్లో పవన్ అభిమానులు చేసిన కాబోయే సీఎం పవన్ అని చేసిన నినాదాలను కూడా జగన్‌కు తెలిపారని ఊహాగానాలు వినిపించాయి.
కాటమరాయుడు సినిమా గురించి ఆరా తీయడం వెనుక జగన్‌కు ఏం లెక్కలు ఉన్నాయో ఆయనకే తెలియాలి అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించినందున ఆయనకు ఫాలోయింగా ఎలా ఉందనే అంశాన్ని తెలుసుకోవాలనుకున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మింగుడు పడని పవన్ కళ్యాణ్
కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు. కాబట్టి జగన్ అందుకోసం ఆరా తీసి ఉండరని కూడా అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. గత కొద్ది రోజులుగా జగన్‌కు పవన్ కళ్యాణ్ మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు.
జగన్ లేవనెత్తుతున్న పలు అంశాలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారు. తద్వారా జగన్ కార్నర్ అవుతున్నారనే వాదనలు ఉన్నాయి. టిడిపి ప్లాన్‌లో భాగంగానే పవన్ తెరపైకి వస్తున్నారనేది వైసిపి వాదన.

టిడిపి కాదు... పవన్ టార్గెట్ 2019
ప్రత్యేక హోదా నుంచి మొదలు ఇటీవలి అగ్రిగోల్డ్ ఇష్యూ వరకు జగన్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 2019లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ఉద్దేశ్యంలో భాగంగా సమస్యలపై లేవదీస్తున్నారని, అందులో టిడిపి ప్లాన్ అంటూ ఏదీ ఉండకపోవచ్చునని కొందరు అంటున్నారు.

వదులుకోవడం ఇష్టం లేకున్నా..
పవన్ కళ్యాణ్ గత కొద్దికాలంగా టిడిపి-బిజెపి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. టిడిపి మాత్రం ఆయన ప్రశ్నలకు సానుకూలంగా స్పందిస్తోంది. ఆయనను వదులుకునే ఉద్దేశ్యం టిడిపికి లేదు. బీజేపీ కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కానీ ప్రత్యేక హోదా అంశాన్నే పవన్ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం, అది ఇచ్చే అవకాశం లేకపోవడంతో బీజేపీ ఎదురు దాడి చేస్తోంది.

పవన్ కళ్యాణ్‌న్ పై వైసిపి..
వైసిపి లేదా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ పైకి మాత్రం పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా అంత శక్తిమంతుడుగా చూడటం లేదనే చెప్పవచ్చు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. పవన్ వల్లే 2014లో టిడిపి గెలిచిందని వైసిపి పలుమార్లు చెప్పింది. ఆ జనసేన మాత్రం రాజకీయంగా తమకు పోటీ కాదన్నట్లుగా వైసిపి కనిపిస్తోంది. టిడిపి ప్లాన్‌లో భాగంగానే ఆయన సమస్యలను లేవనెత్తుతున్నారని, సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదనేది వైసిపి వాదన.

చర్చకు దారి తీసిన పవన్ కళ్యాణ్ మౌనం
2019లో పవన్ అనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రతిపక్ష వైసిపికి గట్టి పట్టు ఉంది. జగన్‌ను టార్గెట్ చేసే చంద్రబాబు కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డి, కర్నూలు నుంచి అమర్నాథ్ రెడ్డిలను కేబినెట్లోకి తీసుకున్నారు. వైసిపి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకోవడంపై పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా స్పందించకపోవడాన్ని వైసిపి ప్రశ్నిస్తుండగా, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Pawan Kalyan on Lokesh: లోకేష్ కు ప్రమోషన్ పై నోరువిప్పిన పవన్..! కీలక వ్యాఖ్యలు..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?











Click it and Unblock the Notifications