ఎంత ఎల్లో చొక్కా తొడుక్కుంటే మాత్రం...: ఆంధ్రజ్యోతిపై జగన్ వ్యంగ్యం

హైదరాబాద్: తుని ఘటనపై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారంనాడు ఆంధ్రజ్యోతి మీడియాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మీడియా సమావేశం చివరలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఎంత ఎల్లో చొక్కా వేసుకున్న పత్రిక అయితే మాత్రం, అంతగా పక్కదొవ పట్టించాలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మంత్రివర్గంలో హరిరామ జోగయ్య ఉన్నారని, వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారని ఆయన రాశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెబుతూ చంద్రబాబు ఎంత క్రిమినలో తెలిసిన తర్వాత కూడా అలాగా అని అన్నారు.

YS Jagan makes comments against Andhrajyothy

మరో ప్రశ్నకు సమాధానంగా క్రిమినల్ నెంబర్ వన్ చంద్రబాబును అడగబ్బా అంటూ జగన్ లేచి వెళ్లిపోయారు. అంతకు ముందు మీడియా సమావేశంలో ముగింపుగా ఆయన కాపు సామాజిక వర్గానికి విజ్ఝప్తి చేశారు. కాపుల ఉద్యమం సమంజసమని అన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నామని ఆయన చెప్పారు.

ఉద్యమాన్ని శాంతియుతంగా నడుపుదామని, అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందామని, లేదంటే చంద్రబాబు ఏదైనా చేసి మనపై బురద చల్లుతారని ఆయన అన్నారు. సంయమనం పాటించాలని, ఎక్కడైనా విధ్వంసం చేస్తే మనకు చెడ్డపేరు ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+