పరిశ్రమల్ని త్వరగా పట్టాలెక్కించాల్సిందే-జగన్ ఆదేశాలు- డిసెంబర్ లో రాష్ట్రమంతా ఇంటర్నెట్
అమరావతి : ఏపీలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుల్ని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల నిర్మాణంపైనా సమీక్షించిన జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నాటికి పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని అధికారులకు సూచించారు.

పారిశ్రామిక ప్రాజెక్టులపై జగన్ సమీక్ష
ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల రంగంపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటికే అనుమతిచ్చిన ప్రాజెక్టులపై ముందుగా చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుల వివరాల్ని అధికారుల నుంచి తెలుసుకున్న సీఎం జగన్...ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూత నివ్వాలన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించారు. ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో సీఎస్, సీఎంఓ అధికారులు ఉండేలా చూడాలన్నారు. అనుమతుల్లో జాప్యంలేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా వాటికి క్లియరెన్స్ ఇమ్మని ఆదేశించారు.

పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై
పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్షించారు. రామాయపట్నం పోర్టులో మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. 2023 డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రయత్నించాలని అధికారులకు జగన్ సూచించారు. మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు వారు తెలిపారు. అలాగే
భావనపాడు పోర్టు పనులను డిసెంబర్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి విడతలో నిర్మించనున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల పనుల ప్రగతిని సీఎం సమీక్షించారు. 2023 జూన్ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే రాష్ట్రానికి మంజూరైన బల్క్‌డ్రగ్ పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. బల్క్ డ్రగ్‌పార్కులో కంపెనీలు పెట్టేందుకే మేజర్ ఫార్మా కంపెనీల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

డిసెంబర్ కల్లా అందరికీ ఇంటర్నెట్
డిసెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లకు ఫైబర్‌తో అనుసంధానంచేసి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. 5జీ సేవలను గ్రామాలకు చేరవేయడంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. దీనికోసం టెలికాం దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయన్నారు. వైయస్సార్ జిల్లా వేల్పులలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడనుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ లైబ్రరీలు వస్తే.. తమ సొంత గ్రామాలనుంచే మెరుగైన ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెఫ్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ అవుతుందని, చాలామందికి ఆదర్శనీయంగా నిలుస్తుందని సీఎం జగన్ వివరించారు

ఎంఎస్ఎంఈలపై జగన్
ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ప్రతిజిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్‌ఎంఈలను నెలకొల్పేందుకు కృషిచేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. పరిశ్రమలు ప్రారంభం కావడమే కాదు, వాటిని నిలబెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలన్నారు. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకునేలా వాటికి నిరంతరం చేయూతనివ్వాలన్నారు. ఎంఎస్‌ఎంఈలపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదన్నారు. ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ను క్రియాశీలం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌పై ఒక పరిశీలన చేయాలన్నారు. వాటికి ఏపీ ఒక వేదికగా నిలిచేలా ఆలోచన చేయాలన్నారు. ఏయే రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయి, వాటిని ఇక్కడకు తీసుకురావడంద్వారా ఇక్కడి వారికి ఆదాయాలు, ఉద్యోగాల కల్పన ఏరకంగా చేయవచ్చో ఆలోచన చేయాలన్నారు.
ఇతరదేశాల్లో ఉన్న ప్రతిష్ట్మాత్మక ఎంఎస్‌ఎంఈ పార్కులతో టై అప్‌అయ్యే అంశంపైనా కూడా దృష్టిపెట్టాలన్నారు.

పారిశ్రామిక కారిడార్లపై జగన్
విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక నోడల్స్‌ను అభివృద్ధిచేయడంతోపాటు మచిలీపట్నం నోడ్, దొనకొండ నోడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు జగన్ కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. భావనపాడు నోడ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే రామాయపట్నం నోడ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పోర్టులను ఆసరాగా చేసుకుని, పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు. దీనికోసం ఇద్దరు లేదా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, విదేశాల్లో ఎంఎస్‌ఎంఈల రంగంలో మంచి విధానాలపై పరిశీలన చేసి, వాటిని ఇక్కడ అడాప్ట్ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉత్తమ పద్ధతుల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్వహణ విధానాలనూ పరిశీలించాలన్నారు. కాలుష్యాన్ని నివారించడం, ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు పరిశీలనలో భాగం కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు. మార్కెట్లో అవకాశాలున్న ఉత్పత్తులు ఎంఎస్‌ఎంఈల నుంచి వచ్చేలా తగిన విధంగా వారికి సహాయంగా ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications