వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి మేనిఫెస్టోలా: జగన్, యనమల కౌంటర్

|
Google Oneindia TeluguNews

YS Jagan response on Governor speech
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నర్సింహన్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నాయకులు పెదవి విరిచారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమిలేదని ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెైస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగుదేశం మెనిఫెస్టోలా ఉందని ఆయన విమర్శించారు.

కా, వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం టిడిపి మెనిఫెస్టోలా కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలా ఉంటుందా? అని ప్రశ్నించారు. చేయాలనుకున్న అంశాలనే చెప్పామని ఆయన అన్నారు.

గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించిందని వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని ఊహాగానాలతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయని, సామాన్యులకు భూములు కొనే స్తోమత లేదని అన్నారు. వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు.

గవర్నర్ ప్రసంగం తీవ్ర అసంతృప్తి కలిగించిందని మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తున్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం కరపత్రాన్ని గవర్నర్ చదవి వినిపించారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించలేదని అన్నారు. రైతుల రుణమాఫీలను కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మరో ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

English summary
YS Congress Party president and Andhra Pradesh assembly opposition leader YS Jaganmohan Reddy on Saturday said that state governor speech is dissatisfied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X