అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదాయం తీసుకు రండిలా... అధికారులకు జగన్ కీలక ఆదేశాలివే..

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ఇవాళ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించారు. లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు సీఎంకు తెలిపారు.

Recommended Video

GST: రాజధాని లేకున్నా Telangana కంటే AP నే బెటర్ *News | Telugu OneIndia

2018-19లో లిక్కర్‌ అమ్మకాలు 384.31లక్షల కేసులు కాగా, ఇప్పుడు 2021-22లో 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు సీఎంకు తెలిపారు. 2018-19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021-22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందని తెలిపారు. 2018-19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లుకాగా, 2021-22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

రేట్లు షాక్‌ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని సీఎం తెలిపారు. బెల్టుషాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామన్నారు. గత ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని కూడా తెలిపారు.

ys jagan review on income generating departments-key orders to get revenue

దీనిపై స్పందించిన సీఎం జగన్.. నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సూచించారు.ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీ, యూనివర్శిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్నారు.

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని, జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను వారికి సూచించాలని సీఎం కోరారు. మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయిసాగుపై దాడులు నిర్వహించాలన్నారు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం కచ్చితంగా బోర్డులు పెట్టాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్పీకార్యాలయం వరకూ, పీడీఎస్‌ షాపుల వద్ద కూడా ఈ బోర్డులు కనిపించాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాధిపతులతో మాట్లాడి.. దీన్ని అమలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కొత్తరూపు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలన్నారు.

అలాగే మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలన్నారు. అన్ని అనుమతులూ పొంది ఆపరేషన్స్‌ చేయకపోతే ఆదాయాలు రావని జగన్ తెలిపారు. అలాగే ఎర్రచందనం విక్రయానికి అన్నిరకాల అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు.
అక్టోబరు - మార్చి నెలల మధ్య 2640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధంచేశామన్నారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలన్నారు. గ్రేడింగ్‌లో థర్డ్‌పార్టీచేత కూడా పరిశీలన చేయించాలన్నారు.

English summary
ap cm ys jagan on today issued key orders on a review over income generating departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X