జగన్ తిరుమల టూర్ పై భూమన క్లారిటీ..! టీటీడీ ఛైర్మన్ కామెంట్స్ పై..!

ఏపీలో రెండు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 27న తిరుమలలో పర్యటించబోతున్నారనేది ఆ వార్త సారాంశం. గతంలో ఆయన సీఎంగా ఉండగా తిరుమలకు డిక్లరేషన్ లేకుండానే పర్యటనలు చేసేవారు. ఇప్పుడు విపక్ష నేత హోదా కూడా లేని జగన్ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ విషయంలో టీటీడీ ఎలా వ్యవహరించబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది.

ఎల్లుండి జగన్ తిరుమల టూర్ కు వెళ్తున్నారన్న వార్తల్ని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఖండించారు. టీటీడీ ఛైర్మన్ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు పాలనలో కంటే..జగన్, వైఎస్ హయాంలోనే హిందు ధర్మ పరిరక్షణ జరిగిందని భూమన గుర్తుచేశారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం వైసీపీ హయాంలోనే ప్రారంభమైన విషయం కూడా గుర్తుచేశారు.

YS Jagan s Tirumala Tour on August 27 YSRCP Clears the Air Bhumana Karunakar Comments

మరోవైపు టిటిడి స్థలం టూరిజం శాఖకు బదలాయించడం ఘోరమైన అపచారమని భూమన ఆరోపించారు. టూరిజం శాఖకు ఎయిర్ పోర్ట్ దగ్గర 25 ఎకరాలు ఇవ్వవచ్చని, దేవుడు స్థలం ఇవ్వడం తప్పు అని తాను మాట్లాడానన్నారు. దీనిపై టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారితో రాజకీయ ప్రకటన చేయించారన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ధార్మిక సంస్థను రాజకీయ ప్రకటన ఇవ్వడానికి నాంది పలికారన్నారు.

YS Jagan s Tirumala Tour on August 27 YSRCP Clears the Air Bhumana Karunakar Comments

ఓబెరాయ్ హోటల్ కు మటన్ స్ఠాల్, మటన్ కబాబ్, తందూరి కబాబ్ తినాలని అనుమతి ఇచ్చారా అని భూమన ప్రశ్నించారు. అధికారులు ఐతే ఈ ప్రకటన ఇవ్వరని, ఇది పూర్తిగా రాజకీయ ప్రకటన అని ఆరోపించారు. ఉత్తరం వైపుఉన్న పవిత్రమైన స్థలంలో టూరిజంవాళ్ల ప్రాంతీయ కార్యాలయానికి , హోటల్ మేనేజ్మెంట్ కాలేజి చంద్రబాబు 50 ఎకరాలు కేటాయించారని, దీన్ని రద్దు చేయించి పవిత్రను కాపాడాల్సి ఉందన్నారు. ఉత్తరం వైపున ఎస్వీయూనివర్సిటీకు చెందిన ఇంజనీరింగ్ కాలేజి బాయ్స్ హాస్టల్ 15 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని, ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+