వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొర్రె పిల్ల, గొంగళితో జగన్: స్త్రీకి షేకండ్ ఇస్తూ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సోనియా గాంధీ నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒకవైపు విభజన జరుగుతుంటే.. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన బుధవారం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. ఏర్పేడు, రేణిగుంటల్లో జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగాల కోసం యువత ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్ర ప్రజల ఘోష వినిపించడం లేదని ఆరోపించారు. అదే విధంగా చంద్రబాబు కూడా సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యాత్రలో భాగంగా జీవగ్రాంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక గుండె పోటుతో మృతి చెందిన మోజెస్ భగవాన్ దాస్ కుటుంబాన్ని ఓదార్చారు. చెర్లోపల్లి సమీపంలో గీతాకుమారి అనే అంగన్ వాడీ కార్యకర్త జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించించారు.

గొర్రె పిల్ల, గొంగళితో..

గొర్రె పిల్ల, గొంగళితో..

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బహూకరించిన గొర్రె పిల్ల, గొంగళితో జగన్మోహన్ రెడ్డి.

మహిళకు షేక్‌హ్యాండ్

మహిళకు షేక్‌హ్యాండ్

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన జగన్, వారి సమస్యలను తెలుసుకున్నారు.

వృద్ధురాలికి ఓదార్పు

వృద్ధురాలికి ఓదార్పు

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధురాలిని ఓదారుస్తున్న జగన్.

శ్రీకాళహస్తిలో..

శ్రీకాళహస్తిలో..

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. శ్రీకాళహస్తికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి మల్లిఖార్జున స్వాముల వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న కార్యకర్తలు.

నాగలితో..

నాగలితో..

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ యాత్రను నిర్వహించారు. కార్యకర్తలు బహూకరించిన నాగలితో జగన్మోహన్ రెడ్డి.

English summary
YSR Congress Party President YS Jaganmohan Reddy carried his samaikya shankaravam in Tirupathi and Srikalahasti in Chittor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X