వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ చేరిక, జంగాకు జగన్ షాక్: మాజీ ఎమ్మెల్యేకు మాటిచ్చి తప్పారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గం నేత, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి గట్టి షాకిచ్చారా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గం నేత, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి గట్టి షాకిచ్చారా? అంటే అవుననే అంటున్నారు. మూడు రోజుల క్రితం కాసు మహేష్ రెడ్డి వైసిపిలో చేరారు.

టీడీపీ ఆనందానికి చెక్: వైసిపిలోకి మహేష్, వెంటనే టిక్కెట్ ప్రకటించిన జగన్టీడీపీ ఆనందానికి చెక్: వైసిపిలోకి మహేష్, వెంటనే టిక్కెట్ ప్రకటించిన జగన్

నిన్నటి దాకా గురజాల నియోజకవర్గం ఇంచార్జిగా జంగా కృష్ణమూర్తి ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అలాంటి జంగాను ఇప్పుడు జగన్ పక్కన పెట్టి, తెరపైకి కాసు మహేష్ రెడ్డిని తీసుకు వచ్చారని, దీనిపై జంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు.

గురజాల నియోజకవర్గ రాజకీయాల్లో ఇరవై సంవత్సరాలుగా జంగా కృష్ణమూర్తి కీలకంగా ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత జంగా గురజాల నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల అభ్యర్థులకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. ఇందుకోసం ఆయన అప్పులు కూడా చేశారని అంటున్నారు.

ys jagan

అయినప్పటికీ ఆయన నియోజకవర్గంలో పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని చెబుతున్నారు. అయితే, సరస్వతీ భూముల వ్యవహారంలో గొడవ జరిగిన తర్వాత ఇంచార్జి మార్పు వ్యవహారం తెర పైకి వచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో జంగాను పిలిపించిన జగన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ హామీ తర్వాత మార్చిలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని జంగా వర్గీయులు భావించారంటున్నారు.

కాసు మహేష్ చేరికకు ముందు మార్చిలో అవకాశం ఇస్తానని చెప్పిన జగన్, ఆయన పార్టీలో చేరిన తర్వాత జంగాకు షాకిచ్చారని అంటున్నారు. కాసు మహేష్ రెడ్డి చేరిక సమయంలో జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక జంగా కృష్ణమూర్తిని అందలం ఎక్కిస్తామని చెప్పారు.

బీజేపీపై పవన్ కళ్యాణ్ దాడి: అంతా తేలిపోయింది, పక్కా ప్లాన్? బీజేపీపై పవన్ కళ్యాణ్ దాడి: అంతా తేలిపోయింది, పక్కా ప్లాన్?

అయితే, అంతకుముందు మార్చిలో అని చెప్పడంతో మహేష్ రెడ్డిని జంగా కృష్ణమూర్తి చేరికను స్వాగతించారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అని చెప్పడంతో జంగా వర్గం డల్ అయిందని అంటున్నారు.

కాగా, 1999, 2004 ఎన్నికల్లో గురజాల నుంచి జంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా గెలిచారు. బీసీ నాయకుల్లో బలమైన వ్యక్తి. వైయస్ రాజశేఖర రెడ్డి వరుసగా రెండుసార్లు పిలిచి మరీ టీటీడీ సభ్యుడిగా అవకాశమిచ్చారు. మంత్రి పదవి వస్తుందని కూడా చాలామంది భావించారు. మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో టిటిడి పదవి ఇచ్చారని అంటారు. 2009లో కొన్ని కారణాల వల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.

English summary
YS Jagan shocks Janga Krishnamurthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X