వెనక్కు తగ్గిన జగన్, ఆరేళ్ల తరువాత కోర్టుకు - మారుతున్న లెక్కలు..!!

మాజీ సీఎం జగన్ కేసుల్లో కీలక పరిణామం. జగన్ వ్యక్తిగత హాజరు పైన కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విచారణ కు రాకుండా జగన్ మినహాయింపులు కోరటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత తన వ్యక్తిగత విచారణకు కోర్టు ఆదేశాల పైన మినహాయింపు కోరిన జగన్.. సడన్ గా వెనక్కు తగ్గారు. తాను కోర్టుకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. దీంతో, ఆరేళ్ల తరువాత జగన్ కోర్టు ముందుకు రానున్నారు. దీంతో.. ఈ పరిణామం జగన్ కేసుల విచారణలో కీలక మలుపుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

మాజీ సీఎం జగన్ ఈ నెల 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. జగన్ యూరప్‌ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయ స్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. జగన్‌.. ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రావటం లేదనే విషయాన్ని ప్రస్తావించింది.

ys-jagan-to-appear-before-cbi-court-on-21st-of-this-month-as-latest-proceedings

ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో, తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతా రని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా.. అదే రోజున న్యాయస్థానానికి జగన్‌ వస్తారని న్యాయవాది వెల్లడించారు.

దీంతో, ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు. తన పైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తరువాత ఒక్క సారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. 2020 జనవరి 10న చివరి సారిగా కోర్టుకు హాజరయ్యారు. తిరిగి ఇప్పుడు వెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో ఆయనకు కోర్టుకు వెళ్లారు. గత నెలలో జగన్‌ అభ్యర్థనతో యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే.

తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. అందుకు అంగీకరించి యూరప్‌ వెళ్లిన మాజీ సీఎం తాజాగా, హాజరు నుంచి మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతుందని, ఆన్‌లైన్‌లో విచారణకు హాజరవుతానని కోర్టును కోరారు. సీబీఐ అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+