బాబును నిలదీయండి: జగన్, నన్ను తోసి తగ్గారు: జెసి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం సూచనల మేరకు విభజనకు సహకరిస్తున్నారన్నారు. చంద్రబాబు నోటి నుండి సమైక్యం అనే పదం ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం విభజన రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు.
బిల్లు ఆగలేదు: పురంధేశ్వరి
గతంలో చట్టసభలకు వచ్చిన బిల్లులు ఆగిన సందర్భాలు లేవని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గుంటూరు జిల్లాలో అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన పురంధేశ్వరిని పలువురు సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విభజన బిల్లును ఆపే ప్రయత్నం చేస్తామన్నారు. జనవరి 23వ తేదీ దాకా బిల్లును ఆపే అవకాశముందన్నారు. కాంగ్రెసు పార్టీకి గతంలోను ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని తట్టుకొని నిలబడగల్గుతుందని చెప్పారు. తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామన్నారు.
నన్ను తోశారు: జెసి
రాయల తెలంగాణపై తనను ముందుకు తోసి మిగతా నాయకులు వెనక్కి తగ్గారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమన్నారు. అయినా తాము సమైక్యం కోసం చివరిదాకా పోరాడుతామన్నారు. రాయల తెలంగాణ కోసం ముందుకు వచ్చిన నేతలు తనను ముందుకు తోసి ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 23వ తేదీన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం తాము అఫిడవిట్లను ఇస్తామన్నారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే సీనియర్ నేతల గొంతు నొక్కేసినట్లే అవుతుందన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయం వైయస్ జగన్ ఇంకా చెప్పలేదన్నారు. అదంతా మీడియా సృష్టే అన్నారు.












Click it and Unblock the Notifications