జగన్ వ్యాఖ్యలతో చంద్రబాబు, స్పీకర్ సహా అందరూ నవ్వేశారు: సభ నుంచి వైసీపీ వాకౌట్

ఇంతకుముందు పాత అసెంబ్లీలో కనీసం మైకు ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అమరావతి: ఇంతకుముందు పాత అసెంబ్లీలో కనీసం మైకు ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఇప్పుడు దీనివైపు చూడాలో.. మీవైపు చూడాలో తెలియడం లేదని స్పీకర్‌తో అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి.

స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా చంద్రబాబు, ఇతర సభ్యులు నవ్వుతూ ఉండటం కనిపించింది. కాగా, పాత సంప్రదాయ మైకుల స్థానంలో అత్యాధునిక సెన్సర్లు వాడుతూ సౌండ్ సిస్టమ్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కొత్త పరిజ్ఞానం కారణంగా సెన్సర్లతో కూడిన మైకులు కావడం, వాటి నియంత్రణ మొత్తం స్పీకర్ వద్ద ఉండటంతో ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్.. ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను లేవనెత్తారు.

గాలేరు నగరిపై జగన్... బొండా ఉమా

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండోరోజు నీటిపారుదల రంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇచ్చిన వివరణపై.. ప్రశ్నించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపి.. మరో ప్రశ్నకు వెళ్లిపోయారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రి పదే పదే చెబుతున్నారని, దీనిపైనే మాట్లాడతానని అన్నారు. గాలేరు నగరిలో అంతర్భాగామే పులివెందుల అని, దానికి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే తాను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.

ys jagan walk out from AP assembly with his party mlas

చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లలో.. అంటే 2014-15, 15-16, 16-17లో కలిపి గాలేరు నగరి ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయలు కేటాయించారని వైయస్ జగన్ చెప్పారు. అయితే, ఇదే ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 400 కోట్లు ఖర్చుచేసి 80 శాతం పనులు పూర్తి చేశారని, ఆ విషయం మొత్తం ప్రభుత్వం సభకు ఇచ్చిన కాగితాల్లోనే ఉందని చెప్పారు. అందులో మంత్రి చెప్పినట్లు కేవలం మట్టిపనులే కాక కాంక్రీటు పనులు, లైనింగ్ పనులు, ప్రాజెక్టు పనులు, గేట్లు పెట్టినవి అన్నీ ఉన్నాయన్నారు.

వైసీపీ వాకౌట్

ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, కానీ.. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు 58 కోట్లు, 18.5 కోట్ల చొప్పున ఇస్తూ.. ఇదేదో పెద్ద గొప్పగా చేసినట్లు ప్రకటిస్తున్నారని విమర్శించారు. నిరుపేద కుటుంబాలకు ఇచ్చేది ఇంత చిన్న మొత్తం అయినా.. ఏదో చాలా గొప్పగా చేసినట్లు చెబుతున్నారని అన్నారు.

కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు నెలకు బిల్లు 150 రూపాయలు మాత్రమే వస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక 500 రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నారు. ఈ పరిస్థితికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+