నెల్లూరులో వైయస్, ఖనిలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
నెల్లూరు/కరీంనగర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం రామాపురం సెంటరులో శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అనంతరం దానికి నిప్పు పెట్టారు.
ఈ విషయం తెలిసిన వెంటనే వరికుంటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగ్రహం కాలిపోతుండటంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటన పైన విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గోదావరిఖనిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పలు దళిత సంఘాలు, అంబేడ్కర్ వాదులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీపాద రావు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. వంశీచంద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, వెల్దండ మండలంలో రేపు రీపోలింగ్ జరగనుండడంతో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బిజెపి అభ్యర్థి ఆచారీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications