వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Viveka murder case : సొంతింటి వేట కొడవళ్ళే .. వైఎస్సాసుర కుటుంబ రక్త చరిత్ర ఇది : లోకేష్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. సిబిఐ దర్యాప్తు వేగంగా సాగుతున్న సమయంలో టిడిపి నేతలు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు. హత్యోదంతంలో అసలు దోషులను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోట్ల కోసం సొంత బాబాయ్ పై గొడ్డలి వేటు వేసి మీ చేతి కంటే నెత్తుటిని చంద్రబాబు నాయుడు గారికి ఎలా పూశారు వైఎస్ జగన్ గారు అంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

నిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి ; జగన్ రెడ్డి సూసైడ్ చేసుకున్న కమల్ ను తీసుకురాగలరా : లోకేష్ ధ్వజంనిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి ; జగన్ రెడ్డి సూసైడ్ చేసుకున్న కమల్ ను తీసుకురాగలరా : లోకేష్ ధ్వజం

సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి ఓట్ల కోసం చంద్రబాబుపై దుష్ప్రచారం

సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి ఓట్ల కోసం చంద్రబాబుపై దుష్ప్రచారం

అప్పట్లో వైయస్ జగన్ కు సంబంధించిన పత్రికలో ప్రచురితమైన ఒక వార్త పేపర్ కటింగ్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన నారా లోకేష్ రక్త సంబంధీకులు అయిన సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి ఓట్ల కోసం నారాసుర రక్త చరిత్ర అంటూ విష పుత్రిక అయిన పత్రిక ద్వారా ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. అంతేకాదు దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలపై వైయస్ కుటుంబానికి పేటెంట్ హక్కులు ఉన్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నారా లోకేష్. వైయస్ వంశ రక్త చరిత్రకి తాజా సాక్ష్యం అదే కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డి హత్య అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.

 అది ఇంటి గొడ్డలే ..సొంత బాబాయినే చంపుకున్న వైయస్సాసుర కుటుంబ రక్త చరిత్ర

అది ఇంటి గొడ్డలే ..సొంత బాబాయినే చంపుకున్న వైయస్సాసుర కుటుంబ రక్త చరిత్ర

వైయస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని సిబిఐ పిలుస్తుంటే అది ఇంటి గొడ్డలేనని అర్థమవుతుందని లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాదు సొంతింటి వేటకొడవళ్ళే వివేకాను వేటాడాయి అని స్పష్టమవుతోందని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ,ఆధిపత్యం, గనులు, అక్రమాల కోసం సొంత బాబాయినే చంపుకున్న వైయస్సాసుర కుటుంబ రక్త చరిత్రని నీ దొంగ పేపర్లో ఎలా అచ్చు వేస్తావో చూస్తాను జగన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు లోకేష్ .

 స్పీడ్ గా జరుగుతున్న వైఎస్ వివేకా హత్యకేసు విచారణ

స్పీడ్ గా జరుగుతున్న వైఎస్ వివేకా హత్యకేసు విచారణ

ఇదిలా ఉంటే మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే కడప పులివెందులలో పలువురు అనుమానితులను విచారించిన సిబిఐ అధికారులు నిన్న సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను, మాజీ డ్రైవర్ దస్తగిరిని వివేకానంద రెడ్డి ఇంటికి తీసుకు వెళ్లారు . అనంతరం వారి సమక్షంలో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆతర్వాత వారిద్దరినీ ఆర్అండ్ బీ అతిథి గృహానికి తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఇక మరోవైపు వివేకా నంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.

బృందాలుగా అనుమానితులను విచారిస్తున్న సీబీఐ

బృందాలుగా అనుమానితులను విచారిస్తున్న సీబీఐ


పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను సైతం విచారించారు. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. కడప కేంద్ర కారాగారం లోని అతిథిగృహంలో మరో ముగ్గురు అనుమానితులను మరో సీపీఐ బృందం విచారించింది వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, వివేక పొలం పనులు చూసుకునే జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమా శంకర్ రెడ్డి , ఓ యూట్యూబ్ ఛానల్ విలేఖరి తో పాటు సునీల్ కుమార్ బంధువు భరత్ యాదవ్ ను సిబిఐ అధికారులు విచారించారు .

ఈరోజు విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డి

ఈరోజు విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డి

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్న నేపథ్యంలో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఆయనతోపాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి కూడా ఈ రోజు సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆరా తీస్తున్న అధికారులు అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Consequences in the Vivekananda Reddy murder case are changing rapidly. TDP leaders are targeting AP CM YS Jagan Mohan Reddy at a time when the CBI investigation is in full swing. TDP leaders are demanding that the real culprits in the murder be arrested and prosecuted. Recently, TDP national general secretary Nara Lokesh flagged off a social media platform on how YS Jagan hacked his own uncle for crores and spilled blood on Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X