'బాబు దోస్తుంటే, లోకేష్ దాస్తున్నారు': 'జగన్ టార్గెట్‌తో బడ్జెట్ పట్టించుకోని సీఎం'

విజయవాడ: ఏపీలో దాచుకో - దోచుకో పథకాన్ని అమలు చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి మంగళవారం నాడు ఆరోపించారు. పెదబాబు చంద్రబాబు దోస్తుంటే, చినబాబు లోకేష్ దాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పెద్దలే ఇసుకను దోచుకున్నారన్నారు. ఇక ఉచిత ఇసుకతో కార్యకర్తలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీకి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, అయినప్పటికీ టిడిపి నేతలు నోరు మెదపడం లేదన్నారు.

YSRC MLC hot comments on Chandrababu and Lokesh

ఎమ్మెల్యేల చేరిక బిజీతో బడ్జెట్‌ను పట్టించుకోని సీఎం

ఎమ్మెల్యేల చేరికలతో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బడ్జెట్ విషయమై పట్టించుకోలేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విజయవాడలో ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు విజయవాడలో ఆందోళన నిర్వహించారు.

ఏలూరు రోడ్డులో కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల చేరికలతో బిజీగా ఉన్న చంద్రబాబు బడ్జెట్‌ను పట్టించుకోలేదని, బడ్జెట్‌కు ముందు ఎంపీలను కేంద్రం వద్దకు పంపించలేదన్నారు.

అందుకే న్యాయపరంగా కేటాయింపులు జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు అడిగితే రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, మోడీలు దగా, వంచన చేస్తున్నారన్నారు. ఈ జోడీ వంచన జోడీ అన్నారు. సీఎం, పీఎం వైఖరితో బడ్జెట్లో ఏపీ నష్టపోయిందన్నారు. ఈ ఆందోళనలో రఘువీరాతో పాటు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణులు పాల్గొన్నారు. ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ జాం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+