పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ కల్తీ వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తు న్నారు. అటు వైసీపీ సైతం ఈ వ్యవహారం న్యాయస్థానంలో తేల్చుకోవాలని డిసైడ్ అయింది. కాగా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్ల పైన వరుస దాడులతో ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు పవన్ ను లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఈ దాడుల పై ఏం సమాధానం చెబుతారని నిలదీస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్స్‌తో దాడులు చేయడం దుర్మార్గమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జోగి రమేష్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించిన బొత్సా 20 నెలల చంద్రబాబు పాలన, సీబీఐ సిట్ ఛార్జిషీట్ తర్వాత కూడా ఇంకా దిగజారిపోయి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కొడుకు లోకేష్‌కే కాదు.. చంద్రబాబుకి కూడా చిప్ చెడిపోయిందేమో అని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుడిని రాజకీయాల్లోకి మా పార్టీపై బురదజల్లడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రభుత్వమే దాడులను ప్రేరేపించడం సిగ్గుచేటని చెప్పారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనే అన్ని న్యాయ మార్గాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్ లో తాము కోరుకున్న విధంగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పకపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు.

సుప్రీంకోర్టు పై నమ్మకం లేదా
కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీదనే చంద్రబాబుకి విశ్వాసం లేకుండా ఇంకా తిరుమల లడ్డూపై దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబుకి కలియుగ దైవమే తగిన విధంగా బుద్ధి చెబుతాడని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు, రౌడీలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేసే సంస్కృతిని చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వమే దగ్గరుండి ప్రతిపక్ష నాయకుల మీద హత్యాయత్నం చేసే ఈ చర్యలను ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలని సూచించారు. ఇంత జరుగు తుంటే బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు..గొప్ప గొప్ప కబుర్లు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని బొత్సా ప్రశ్నించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications