గుళ్లు కూల్చి బాత్రూంలు.. బాబును అడ్డుకోండి!: శివసేనకు రోజా కౌంటర్..
'గుళ్లను కూల్చి బాత్రూంలు కట్టించే చంద్రబాబు లాంటి నాయకులను శివసేన నేతలు అడ్డుకుంటే బాగుంటుందని' రోజా కౌంటర్ ఇచ్చారు.
తిరుపతి: పవిత్ర తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదంటూ ఎమ్మెల్యే రోజాకు శివసేన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే దీనిపై పోరాటానికి కూడా తాము సిద్దమేనని చెప్పడం.. శివసేన దీన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థమవుతోంది. మరోవైపు రోజా మాత్రం శివసేన వ్యాఖ్యలు దుందుడుకు చర్యే అన్నట్లుగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.
శివసేన నేతలు కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయకుండా మిగతా వాళ్లపై కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని రోజా సూచించారు. తిరమలను అపవిత్రం చేసేవారు టీడీడీ బోర్డులోనే ఉన్నారని.. అలాంటి వారంతా తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమలలో తనకన్నా ఎక్కువగా టీడీపీ నేతలే రాజకీయాలు మాట్లాడిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు.

ముఖ్యంగా 'గుళ్లను కూల్చి బాత్రూంలు కట్టించే చంద్రబాబు లాంటి నాయకులను శివసేన నేతలు అడ్డుకుంటే బాగుంటుందని' రోజా కౌంటర్ ఇచ్చారు. కాగా, తిరుమల కొండ మీద రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దన్న నిబంధనలు ఉన్నా.. ఎమ్మెల్యే రోజా మాత్రం తిరుమల వచ్చిన ప్రతీసారి దాన్ని ఉల్లంఘిస్తున్నారని పలు హిందూ సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి.
అటు అధికార పార్టీ విమర్శలు, ఇటు శివసేన, హిందూ సంస్థల ఆగ్రహంతో రోజాపై ఒత్తిడి పెరుగుతోంది. రోజాపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకైనా సిద్దమేనంటూ పలు హిందూ సంస్థలు












Click it and Unblock the Notifications