అసెంబ్లీ సాక్షిగా అబద్దాలా?: జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: గవర్నర్ నర్సింహన్ ప్రసంగాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టపగలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా ప్రకటనలు చేయించిందని ఆరోపించారు.
టిడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా మాఫీ చేసుకుంటూ వస్తోందని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగం వాస్తవ రూపంలో అమలయ్యే విధంగా లేదని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలనే.. పేర్లు మార్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పడం సరికాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

మరో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పోలవరానికి రూ.4వేల కోట్లు కేటాయించిన ఘనత వైయస్సార్‌కే దక్కుతుందని అన్నారు. రాజధానికి 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని ఈ సందర్భంగా ఆర్కే గుర్తు చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగించే సమయంలో మీడియా పాయింట్ వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు.
గవర్నర్‌తో అసత్యాలు చెప్పించారు: కాంగ్రెస్
గవర్నర్ నర్సింహన్ ప్రసంగం అంతా తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదా అనంతరం ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రభుత్వం గవర్నర్‌తో అసత్యాలు చెప్పిందని వ్యాఖ్యానించారు.
తొమ్మిది నెలల కాలంలో ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదని ఆరోపించారు. లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం...గవర్నర్ ప్రసంగంలో అస్యతాలు ఉన్నాయనడానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications