వైసీపీకి పవన్ మద్దతు, టిడిపితో లేనని చెప్పారు :ఎంపీ వరప్రపాద్ సంచలనం
అమరావతి: ఎన్నికల తర్వాత జనసేన చీఫ్ వపన్ కళ్యాణ్ తమ పార్టీకి మద్దతిస్తానని హమీ ఇచ్చారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జనసేన, వైసీపీ పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తామని వరప్రసాద్ చెప్పారు.
తిరుపతి ఎంపీ, వైసీపీ ఎంపీ వరప్రసాద్ మీడియాతో చిట్‌చాట్ చేశారు.. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై వపన్ కళ్యాణ్ తనతో చర్చించారని వరప్రసాద్ చెప్పారు.
ఇటీవల కాలంలో తాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసినట్టు వరప్రసాద్ చెప్పారు. వపన్ కళ్యాణ్ పోన్ చేసి ఆహ్వనిస్తేనే తాను వెళ్ళినట్టు వరప్రసాద్ చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు ఆయన చెప్పారు.

వైసీపీకి మద్దతిస్తానని పవన్ చెప్పారు
2019 ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. ప్రత్యేక హోదాపై జనసేనతో కలిసి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు
నన్ను ఎందుకు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని తనను పవన్ కళ్యాణ్ అడిగారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. టిడిపికి అనుకూలంగా మాట్లాడుతున్నందుకే తాము విమర్శలు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్‌కు చెప్పానని వరప్రసాద్ తెలిపారు.

టిడిపితో లేనని చెప్పిన పవన్ కళ్యాణ్
తాను టిడిపితో లేనని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో ఎందుకు టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ వివరించారని ఆయన చెప్పారు.

రాజకీయంగా వ్యాఖ్యల దుమారం
రాజకీయంగా ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా ఇప్పటికే మరింత హీట్‌ను పెంచాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ టిడిపిపై విమర్శలను గుప్పించారు.












Click it and Unblock the Notifications