బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: అంకుల్‌తో బెడ్ షేరింగ్..అయిదుమంది మైనర్లతో: భర్త దారుణహత్య: సుపారీ గ్యాంగ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అక్రమ సంబంధం.. దారుణహత్యకు దారి తీసింది. ప్రియుడితో కలిసి భర్తను మట్టు పెట్టింది. దీనికోసం సుపారీ కిల్లర్ గ్యాంగ్‌ను బరిలోకి దించిందా మహిళ. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసింది. దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగింది. ఏకంగా తొమ్మిది మందితో దారుణంగా హత్య చేయించింది. సవాల్‌గా మారిన ఈ హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. మొత్తం సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది.

 రెండేళ్లుగా ప్రేమాయణం..

రెండేళ్లుగా ప్రేమాయణం..

ఈ కేసులో ప్రధాన నిందితురాలి పేరు తస్లీమా బాను. వయస్సు 28 సంవత్సరాలు. భర్త మహ్మద్ షఫీతో కలిసి బెంగళూరులోని సుద్దగుంటెపాళ్య పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు అఫ్సర్ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. 44 సంవత్సరాల అఫ్సర్ ఖాన్.. తస్లీమా కుటుంబానికి దూరపు బంధువు. రెండేళ్లుగా వారి మధ్య ప్రేమాయణం సాగింది. రెండేళ్ల కిందట ఓ పెళ్లిలో తొలిసారిగా తస్లీమా బాను.. అఫ్సర్ ఖాన్‌ను కలిసింది. అప్పటి నుంచి వారిద్దరు తరచూ కలుసుకునే వారు. వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

భర్త అడ్డుగా ఉండటంతో..

భర్త అడ్డుగా ఉండటంతో..

తమకు భర్త అడ్డుగా ఉందని భావించిన తస్లీమా బాను.. అతని అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసింది. దీనికోసం అఫ్సర్ ఖాన్ సహకారాన్ని తీసుకుంది. వారిద్దరూ కలిసి సుపారీ గ్యాంగ్‌ను బరిలోకి దించారు. షరీఫ్‌ను హతమార్చడానికి కుట్ర పన్నారు. అఫ్సర్ ఖాన్‌‌ను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా భర్తకు పరిచయం చేసిందామె. అతనితో కలిసి 75 లక్షల రూపాయల మేర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే.. అయిదు లక్షల రూపాయల కమీషన్ వస్తుందని తస్లీమా భర్తను ఒప్పించింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో తరచూ వారిద్దరూ కలుసుకునే వారు.

కమీషన్ పేరుతో రప్పించి..

కమీషన్ పేరుతో రప్పించి..


ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఉదయం అఫ్సర్ ఖాన్.. తస్లీమా భర్త మహ్మద్ షఫీకి ఫోన్ చేశాడు. కమీషన్ కోసం గురప్పన పాళ్యకు రావాల్సిందిగా సూచించాడు. అతని కోరిక మేరకు షఫీ ఒంటరిగా బైక్‌పై గురప్పన పాళ్యకు బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అతని కోసం కాపుగాసిన సుపారీ కిల్లర్ గ్యాంగ్.. కత్తులతో దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపారు. దాన్ని రియల్ ఎస్టేట్ తగాదాలో చోటు చేసుకున్న హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. నడిరోడ్డు మీద రక్తపు మడుగులో కనిపించిన షఫీ మృతదేహాన్ని సుద్దగుంటెపాళ్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు రోజుల తరువాత కేసును ఛేదించారు.

హంతకుల్లో అయిదుమంది మైనర్లు..

హంతకుల్లో అయిదుమంది మైనర్లు..


ఈ కేసులో మొత్తం తొమ్మిదిమందిని సుద్దగుంటెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అయిదుమంది మైనర్లే. అఫ్సర్ ఖాన్, తస్లీమా బాను, తబ్రేజ్ పాషా, సయ్యద్ వసీీం, వెంకటేష్, బారాత్, యుగేంద్ర, చేతన్, ఇబ్రహీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేష్, బారాత్, యుగేంద్ర, చేతన్, ఇబ్రహీం వయస్సు 18 సంవత్సరాల్లోపేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. హత్య చేయడానికి మైనర్లను వినియోగించుకోవడాన్ని క్రిమినల్ చర్యగా భావిస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

English summary
A man was attacked with lethal weapons and left him to die on the middle of the road. Just days later, the Suddaguntepalya police tracked the attackers. The victim’s wife and lover had hired nine supari killers to do. Police arrest Nine persons have been arrested now, five of whom are teenagers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X